Sai Pallavi, Rana: ‘విరాట పర్వం’ టీం కి కర్నూల్ లో చేదు అనుభవం..!

Ad not loaded.

రానా, సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ను నిన్న అంటే ఆదివారం నాడు సాయంత్రం కర్నూల్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. డీఎస్‌ఏ గ్రౌండ్స్ లో నిర్వహించారు మేకర్స్. అయితే ఈదురుగాలుల దెబ్బకి అక్కడి ఎల్‌ఈడీ స్క్రీన్‌ కిందపడిపోయింది. దీంతో ఈవెంట్ ను మధ్యలో ఆపేశారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదు.అయితే మరోపక్క అదే టైంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటి కమ్ముకుంది.

రానా, సాయి పల్లవి ఆ చోటుకి రాకముందే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. ఇక ‘విరాట పర్వం’ విషయానికి వస్తే… ‘నీది నాదీ ఒకే కథ’ వంటి చిత్రాన్ని అందించిన వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్ తో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. రానా, సాయి పల్లవి ల నేచురల్ పెర్ఫార్మన్స్, డైలాగులు, విజువల్స్ వంటివి ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ గా నిలిచింది. ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, సాయి చంద్ వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్లపై… సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి ఓటిటి నుండీ భారీ ఆఫర్లు లభించినప్పటికీ థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. జూన్ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus