రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘విరాటపర్వం’. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. డి.సురేష్ బాబు సమర్పణలో ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1990 ల కాలంలో నక్సలైట్ లు మరియు పోలీసులకు మధ్య జరిగిన పోరు.. వాటి మధ్య పుట్టిన ఓ ప్రేమ కథ ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందింది.
సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నవీన్ చంద్ర, నివేద పేతురాజ్, ప్రియమణి వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.ఇక టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. జూన్ 17న విడుదల అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని రాబట్టుకుంది కానీ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ‘విరాట పర్వం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.51 cr |
సీడెడ్ | 0.09 cr |
ఉత్తరాంధ్ర | 0.10 cr |
ఈస్ట్ | 0.06 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.07 cr |
కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.15 cr |
ఓవర్సీస్ | 0.45 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.60 cr |
‘విరాటపర్వం’ చిత్రానికి రూ.13.44 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.6 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.1.6 కోట్ల షేర్ నమోదైంది.సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ కాబట్టి.. జనాలను ఆకర్షించలేకపోతుంది. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి.వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ ఎంత వరకు రాబడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!