రానా – సాయిపల్లవిల ‘విరాట పర్వం’ రిలీజ్ డేట్ మారింది. ఈ మాట వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ‘ఇంకెన్ని రోజులు వాయిదా వేశారు?’ అని. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిననన్ని పాజ్‌లు ఇటీవల కాలంలో ఇంకే సినిమాలు రాలేదు అని చెప్పాలేమో. రానా సినిమా ఇలా చేశామా, అలా రెడీ చేశామా, విడుదల చేశామా అనిపించేలా ఉంటుంది. కానీ ‘విరాటపర్వం’ మాత్రం అలా కాదు. కరోనా మహమ్మారి దేశంలోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అవ్వకముందే రెడీ అయిపోయింది.
కానీ విడుదల కాలేదు.‘విరాటపర్వం’కి మంచి బజ్ ఉన్న రోజుల్లోనే సినిమా వాయిదాపడింది. కరోనా పరిస్థితుల రీత్యా నిర్మాత సురేశ్‌బాబు సినిమాను విడుదల చేయలేదు. ‘నారప్ప’, ‘దృశ్యం’ ఓటీటీకి ఇచ్చేసిన సమయంలో ‘విరాటపర్వం’ కూడా ఇచ్చాస్తారేమో అనుకున్నారు. ఓ దశలో డీల్ అయిపోయింది అని కూడా అన్నారు. తర్వాత పరిస్థితులు అనుకూలించినా సినిమా విడుదల చేయలేదు. చాలా సినిమాలు వచ్చేసినా ఇది ఆపేస్తుండటంతో ఓటీటీ పక్కా అన్నారు. కానీ అవ్వేలేదు.
ఫైనల్‌గా ఇటీవల సినిమా రిలీజ్ డేట్‌ను ఘనంగా ప్రకటించారు. జులై 1న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సినిమా నేపథ్యం ఆసక్తికరంగా ఉండటం… రానా – సాయిపల్లవి లాంటి నటులు ఉండటంతో ఆసక్తి బాగా ఉంది. కానీ సరైన రిలీజ్ డేట్‌లు చెప్పక అది పోతూ వచ్చింది. కానీ ఇప్పడు మళ్లీ సినిమా డేట్ మారింది. అయితే ఈసారి పోస్ట్ పోన్ కాదు, ప్రీ పోన్. అవును సినిమాను రెండు వారాలు ముందుకు తెస్తున్నారు.
జూన్ 17న ‘విరాటపర్వం’ థియేటర్లలోకి దిగబోతోందట. ఆ రోజున రావాల్సిన ‘రామారావు – ఆన్ డ్యూటీ’ వాయిదా పడటంతో ఆ డేట్‌లోకి ‘విరాటపర్వం’ సినిమాను తీసుకొచ్చేశారు నిర్మాత సురేశ్‌బాబు. సినిమా ఎప్పుడో రెడీగా ఉండటంతో… డేట్ ముందుకు తెచ్చినా పెద్ద ఇబ్బందేం లేదు. మరి సురేశ్‌బాబు నమ్మకంతో ఓటీటీకి ఇవ్వని ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!