Virata Parvam OTT: తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘విరాట పర్వం’

నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రానా, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ ను అయితే సంపాదించుకుంది కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ సమర్పణలో ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయమని భారీ ఆఫర్లు వచ్చాయి.

రూ.40 కోట్ల వరకు నెట్ ఫ్లిక్స్ వారు ఆఫర్ చేశారు. కానీ ఎందుకో బయ్యర్స్ థియేటర్ కే ఇంట్రెస్ట్ చూపించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూస్తేనే బాగుంటుంది అని చాలా మంది విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకేనేమో సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకే ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ డిసైడ్ అయ్యారు.

అవును నెట్ ఫ్లిక్స్ లో ‘విరాట పర్వం’ చిత్రం జూలై 1 నుండి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఓటీటీలో అయినా ఈ చిత్రం మంచి ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రలో కనిపించగా.. ప్రియమణి భారతక్క పాత్ర పోషించింది.

నవీన్ చంద్ర, బెనర్జీ, రాహుల్ రామకృష్ణ,ఈశ్వరి రావు వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించగా శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరించారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus