చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడానికి దర్శకుడు మొదలుకొని నిర్మాత వరకు నానా ఇబ్బందులుపడుతున్నారు. అల్లు అరవింద్ (Allu Aravind), దిల్ రాజు (Dil Raju) వంటి అగ్ర నిర్మాతలే స్టేజ్ మీద డ్యాన్సులు వేసి మరీ తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటున్నారు. అందువల్ల ఒక సినిమాని ఇలానే ప్రమోట్ చేయాలి అనే నిబంధనలు ఏమీ లేవు. ఎవరికి కుదిరినంతలో వాళ్లు ప్రమోట్ చేస్తారు.

Raja Darapuneni

అయితే.. ఆ ప్రమోషన్స్ పరిధి దాటుతున్నాయా లేక సినిమా పరిధిలోనే ఉంటున్నాయా? అనే విషయంలో మాత్రం స్వీయ నియంత్రణ అవసరం.
ఇవాళ (జూన్ 25) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో “వర్జిన్ బాయ్స్” (Virgin Boys) అనే సినిమా ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. నిజానికి ఇదే ఆ సినిమాకి సంబంధించి మొదటి ప్రెస్ మీట్. దర్శకుడు దయానంద్ (Dayanand), నిర్మాత రాజా దారపునేని (Raja Darapuneni) మరియు హీరోహీరోయిన్లు అందరూ హాజరయ్యారు.

కాలేజ్ స్టూడెంట్స్ సమక్షంలో మంచి ఎనర్జిటిక్ గా జరిగింది ఈవెంట్. అయితే.. ఈ ఈవెంట్లో నిర్మాత రాజా దారపునేని స్టేట్మెంట్స్ మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. ఈవెంట్ మొదట్లో అరియానాతో డ్యాన్స్ చేసి “నా కల నెరవేరింది” అంటూ హల్ చల్ చేసిన నిర్మాత రాజా, అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. “పెళ్లై సరైన శృంగార జీవితం లేని ప్రతి ఒక్క మగాడు వర్జిన్, ఒక్కో అమ్మాయి ఒక్కో టైమ్ లో నచ్చుతుంది, పగలు ఒకమ్మాయి, మధ్యాహ్నం ఒకమ్మాయి, రాత్రికి ఒకమ్మాయి” వంటి సమాధానాలకు ఈవెంట్లో ఈలలు పడినా.. మరీ ఇలాంటి కామెంట్స్ అవసరమా అనిపించకమానదు.

ఎంత కుర్రాడిలా బిహేవ్ చేసినా.. వయసు బట్టి వ్యవహారశైలి ఉండడం అనేది సమంజసం. జూలై 11న విడుదలవుతున్న “వర్జిన్ బాయ్స్” (Virgin Boys)  కి ఈ ప్రమోషన్ కంటెంట్ ఒకరకంగా కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే.. ఇదే ధోరణి మంచిదా అంటే, కచ్చితంగా మంచిది కాదు అనే చెప్పాలి.

‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus