థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. పైగా సమ్మర్ సీజన్. ఇలాంటి టైంలో యూనివర్సల్ అప్పీల్ ఉన్న థ్రిల్లర్ కథలతో కనుక సినిమాలు రూపొందితే.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. తాజాగా వచ్చిన ‘విరూపాక్ష’ సినిమా విషయంలో ఇది మరోసారి నిజమైంది. వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ రూ.20 కోట్ల పైగా షేర్ ను నమోదు చేసింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ఇవి. వీకెండ్ తర్వాత కూడా అదే జోరు కనబరుస్తుంది ఈ మూవీ.
సోమవారం రోజు కూడా బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఈరోజు కూడా వీకెండ్ కు తీసిపోని నంబర్స్ రిజిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే అఖిల్ ‘ఏజెంట్’ సినిమా కలెక్షన్స్ పై కూడా ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు.అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ‘నేను ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నాను..’ అని నిర్మాత అనిల్ సుంకర చెబుతున్నాడు. అదే నిజమైతే పర్వాలేదు.
కానీ కొన్ని ఏరియాల్లో ఆయన ఓన్ రిలీజ్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు అంటున్నారు. అలా అయితే కనుక.. సినిమాకి పాజిటివ్ టాక్ రాకపోతే ఇబ్బంది తప్పదు. పైగా ‘ఏజెంట్’ సినిమా ప్రమోషనల్ కంటెంట్ జనాలను ఆకట్టుకోలేదు. సినిమా పై బజ్ అనేది లేదు. మరోపక్క ‘పీఎస్-2’ కూడా రిలీజ్ కాబోతోంది.
ఆ సినిమాపై కూడా కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. (Agent) ‘ఏజెంట్’ ఓపెనింగ్స్ పై ఆ డబ్బింగ్ సినిమా ప్రభావం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఫైనల్ గా ‘ఏజెంట్’ ఫలితం ఎలా ఉండబోతుందో..!
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?