తెలుగులో ప్రభాస్ (Prabhas) పెళ్ళి గురించి ఏ రేంజ్ హాట్ టాపిక్ అయ్యిందో .. సారి అవుతూ ఉంటుందో, తమిళంలో విశాల్ (Vishal ) పెళ్ళి కూడా అదే రేంజ్ లో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. గతంలో విశాల్… హీరోయిన్ వరలక్ష్మి శరత్ (Varalaxmi Sarathkumar) కుమార్ తో ప్రేమాయణం నడపడం జరిగింది. ఆమె కూడా విశాల్ ను డీప్ గా లవ్ చేసింది. అయితే నడిగర్ సంఘం గొడవల్లో భాగంగా వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్(Sarathkumar), విశాల్..ల మధ్య గొడవలు జరగడం వల్ల .. ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.
ఆ తర్వాత అనీషా రెడ్డితో (Anisha Alla) విశాల్ కి నిశ్చితార్థం జరిగింది. ఈమె ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) చిత్రంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గర్ల్ ఫ్రెండ్ గా కూడా నటించిన సంగతి తెలిసిందే. తర్వాత వీరి పెళ్లి కూడా కాన్సిల్ అయ్యింది. అటు తర్వాత అభినయ (Abhinaya)- విశాల్ పెళ్ళి చేసుకుంటున్నారు అని ప్రచారం జరిగింది. చివరికి వరలక్ష్మి, అభినయ వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు.
విశాల్ మాత్రం ఇంకా పెళ్ళి చేసుకోలేదు. అయినా ఇతని పెళ్ళి గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విశాల్ పెళ్ళి గురించి మరో వార్త తమిళ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ సాయి ధన్సిక తో (Sai Dhanshika) విశాల్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడట. త్వరలోనే వీళ్లు పెళ్ళి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అధికారిక ప్రకటన వస్తే తప్ప ఇందులో ఎంత నిజం ఉంది అనేది అంచనా వేయలేము.