Vishal: వైరల్ అవుతున్న విశాల్ ఆడియో.. కానీ?

తమిళనాడులో దీపావళి పండుగను గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా తమిళనాడులో అన్నాత్తే, ఎనిమీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే రజినీకాంత్ సినిమా చాలాకాలం తర్వాత విడుదల కావడంతో తమిళనాడులోని థియేటర్లలో ఎక్కువ థియేటర్లు ఈ సినిమాకే కేటాయించారు. థియేటర్ల ఓనర్లు ఇలా చేయడంతో ఎనిమీ సినిమాకు ఎక్కువగా థియేటర్లు దక్కడం లేదు.

రజినీకాంత్ పరోక్షంగా విశాల్ కు అన్యాయం చేశారని విశాల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. విశాల్ కు తమిళనాడుతో పాటు తెలుగులో కూడా మంచి స్థాయిలో గుర్తింపు ఉంది. నవంబర్ 4వ తేదీన రెండు సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్ల సమస్య ఎదురవుతోంది. థియేటర్లు దొరకకపోవడంతో థియేటర్ల ఓనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

తమ సినిమాకు కనీసం 250 థియేటర్లను కేటాయించాలని విశాల్ కోరుతుండగా విశాల్ కోరిక మేరకు థియేటర్లు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది. విశాల్ సినిమాకు థియేటర్లు దొరకకపోవడంతో అతని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కనీసం 250 థియేటర్లు దొరకకపోతే విశాల్ మూవీ వాయిదా పడే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. ఎనిమీ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటిస్తుండటం గమనార్హం. విశాల్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి. మరోవైపు విశాల్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాల ఎంపిక విషయంలో విశాల్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎనిమీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విశాల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus