Vishal: ఎట్టకేలకు ఆ అమ్మాయి ఎవరో నోరు విప్పిన విశాల్?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విశాల్ తెలుగు తమిళ భాషలలో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి విశాల్ ఇప్పటికి సింగిల్గానే ఉన్నారు. అయితే ఇటీవల న్యూ ఇయర్ కు వీధులలో ఒక అమ్మాయితో కలిసి ఈయన చెక్కర్లు కొడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

ఒక అమ్మాయితో వీధులలో షికారులు చేస్తూ వెళ్తున్నటువంటి ఈయన కెమెరాలు చూడగానే ఒక్కసారిగా దాక్కొని పారిపోయారు. అయితే ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది విశాల్ తో ఉన్నటువంటి అమ్మాయి ఎవరు ఆమె తన లవరా అంటూ చాలామంది కామెంట్లు చేయడమే కాకుండా ఈయన పట్ల నెగటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ కూడా చేశారు. అయితే ఈ వీడియో పై విశాల్ క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విశాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ న్యూయార్క్ వీధులలో నేను అమ్మాయితో వెళ్తున్నటువంటి వీడియో పై స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ వీడియో వైరల్ అవ్వగానే చాలామందికి నాపై నెగిటివ్ ఫీలింగ్స్ కూడా వచ్చి ఉంటాయన్న సంగతి నాకు తెలుసు. అయితే ఆ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని ఏవేవో ఊహించుకున్నారు నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్స్ లేరని విశాల్ (Vishal) తెలిపారు.

ప్రతి ఏడాది న్యూ ఇయర్ కోసం నేను ఫారిన్ వెళుతూ ఉంటాను ఇది నేను ప్రతి ఏడాది పాటిస్తానని, ఇదొక ఆచారంగా మారిపోయిందని తెలిపారు. అయితే అక్కడ బంధువులతో కలిసి నేను ఎంజాయ్ చేశానని ఇక నా కజిన్స్ నన్ను ఆట పట్టించడం కోసమే ఇలా చేశారు అంటూ ఈ వీడియో పై ఈయన క్లారిటీ ఇస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ పోస్ట్ పై పలువురు స్పందిస్తూ మాకు ముందే తెలుసు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus