Vishal: ఆ సినిమా వదిలేస్తే ఏంటి… విజయ్‌ సినిమాను డైరెక్ట్‌ చేస్తా: విశాల్

‘‘లియో’ సినిమాలో మంచి పాత్ర వస్తే విశాల్‌ వద్దనుకున్నాడు’ అనే మాట ఇలా బయటకు వచ్చిందో లేదో… అయ్యో ఎందుకు వద్దన్నాడు. చేసుంటే బాగుండు అంటూ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ మేరకు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ కూడా చేశారు. అయితే కావాలనే ఆ సినిమా వదులుకున్నాను. దాని వెనుక కారణం ఉంది అంటూ విశాల్‌ క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా మరోసారి ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు.

చాలామంది స్టార్లకు జీవితంలో ఒక్కసారైనా మెగాఫోన్‌ పట్టుకోవాలని, సినిమాను డైరెక్ట్ చేయాలని ఉంటుంది. ఇదే విషయాన్ని తాజాగా చెబుతూ విశాల్ ‘లియో’ సినిమాను రిజెక్ట్‌ చేయడానికి కారణం కూడా చెప్పాడు. అధ్విక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన చిత్రం ‘మార్క్ ఆంటోనీ’. ఈ సినిమా విడుదల నేపథ్యంలో విశాల్‌ ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే ‘లియో’ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో ఫ్యాన్స్‌ అవుతా, అదా సంగతి అనుకున్నారు.

విజయ్‌తో ‘లియో’ సినిమాలో ఆఫర్ నా వరకు వచ్చింది. అయితే ఆ సమయంలో నాకు కుదర్లేదు. కారణం ఏంటంటే… తానెప్పుడూ రెండు సినిమాలను ఒకేసారి చేయనని, ఒకసారి ఒక సినిమాను మాత్రమే చేస్తాననే విషయం చెప్పాడు. దీంతో మధ్యలో ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమా వదిలేసి ‘లియో’ చేయను అని చెప్పేశాను. దాంతో ‘లియో’ సినిమా నుండి తప్పుకున్నాను అని చెప్పాడు విశాల్‌. అంతేకాదు డైరక్టర్‌ అవ్వాలనే తన ఆలోచనలో హీరో విజయ్‌ అని ముందుగానే ఫిక్స్‌ అయిపోయానని చెప్పాడు.

కొవిడ్ సమయంలో విజయ్ మేనేజర్‌కు ఫోన్ చేసి స్క్రిప్ట్ వినిపించడానికి టైమ్‌ అడిగానని చెప్పాడు విశాల్‌. అయితే స్క్రిప్ట్ విషయంలో పూర్తిస్థాయిలో సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది అని చెప్పాడు. స్క్రిప్ట్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ఆ తర్వాత విజయ్‌కు పూర్తిగా చెబుతానని విశాల్‌ చెప్పాడు. ఈలోపు విశాల్‌ (Vishal) డైరక్టర్‌ అవ్వడానికి ‘డిటెక్టివ్‌ 2’ను ఎంచుకున్నాడు. త్వరలోనే సినిమా ప్రారంభం అంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus