Vishal: బడా నిర్మాతతో విశాల్ డబ్బుల లొల్లి

కోలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరో విశాల్ తెలుగు వారికి కూడా సుపరిచితమే. కెరీర్ మొదటి నుంచి కూడా తమిళ్ తెలుగులో అదే తరహాలో సమానమైన క్రేజ్ అందుకుంటున్న విశాల్ ఇటీవల సినిమాల కంటే వివాదాలతోనే హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. రీసెంట్ గా మరి సీనియర్ నిర్మాతతో కూడా గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఆ నిర్మాత మరెవరో కాదు. ఎన్నో సూపర్ గుడ్ సినిమాలను అందించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ.చౌదరి.

విశాల్ 2018లో ‘ఇరుంబు తిరై’ అనే సినిమాను తన సొంత ప్రొడక్షన్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ సినిమాను తెలుగులో ‘అభిమన్యుడు’ టైటిల్ తో డబ్ చేసి విడుదల చేశారు. రెండు భాషల్లోను సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కోసమని విశాల్ ఆర్బీ చౌదరి నుంచి కొంత ఋణం కూడా తీసుకున్నారు. అయితే కొన్నాళ్లకు తీసుకున్న అప్పు మొత్తం తిరిగి చెల్లించినప్పటికి ఆ నిర్మాత తనకు ఇవ్వాల్సిన బ్లాండ్లు, ప్రామిసరీ నోట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

అదే విధంగా పోలీసు కేసు కూడా నమోదు చేసినట్లు అందులో పేర్కొన్నాడు. మరి ఈ విషయంపై RB చౌదరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక విశాల్ చివరగా చక్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దారుణమైన కలెక్షన్స్ అందుకొని డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus