తమిళ నటుడు విశాల్ చాలా కాలంగా తన కెరీర్‌లో సరైన హిట్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. వివాదాల మధ్య అతని మార్కెట్ కూడా తగ్గిపోయింది. కానీ ఆ పరిస్థితుల నడుమ ఆయనకు ఊరట కలిగించిన విషయం ఏమిటంటే, 12 ఏళ్ల క్రితం రూపొందిన సినిమా తాజాగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకోవడమే. 2012లో అనౌన్స్ చేసిన ‘మధ గజ రాజా’ అనేక సాంకేతిక, ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ, ఇటీవలే థియేటర్లకు చేరుకుంది.
Madha Gaja Raja
కానీ ఈ పాత కంటెంట్ ఉహించని రీతిలో ప్రేక్షకుల చేత హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. విశాల్, సంతానం, విజయ్ ఆంటోనీ వంటి నటుల వినోదాత్మక ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా సంతానం హాస్యసన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. విడుదలకు ముందు సోషల్ మీడియాలో పెద్దగా ఆసక్తి కనబడలేదు.
కానీ సినిమా విడుదలైన తర్వాత, కథ, స్క్రీన్‌ప్లే, కమెడీ అంశాలు పెద్ద మొత్తంలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా బాగా ఆదరిస్తున్నారు. ‘మధ గజ రాజా’ ఆలస్యంగా వచ్చినా సమకాలీనంగా అనిపించడం విశేషం. సినిమా సాంకేతికత, కథన తీరును చూసిన ప్రేక్షకులు మంచి కామెంట్స్ ఇస్తున్నారు. సునీల్ శెట్టి, వివేక్ పాత్రలు కూడా సినిమాలో కొత్త ఒరవడిని చూపించాయి.
చెన్నై నుండి వచ్చిన టాక్ ప్రకారం, ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడంతో, మేకర్స్ ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకించి విశాల్ కెరీర్‌కు ఈ సినిమా ఊహించని విధంగా బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సక్సెస్ వల్ల విశాల్ తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమా విడుదలలో ఆలస్యం, వివాదాల అనంతరం వచ్చిన హిట్ టాక్ సినీ పరిశ్రమలో ప్రత్యేక చర్చకు దారితీసింది.