మే 11న విశాల్‌ ‘రాయుడు’ ఆడియో

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా, శ్రీదివ్య కథానాయికగా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాయుడు’. విశాల్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ – ”ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నా కెరీర్‌లో మరో డిఫరెంట్‌ సినిమా అవుతుంది. డైరెక్టర్‌ ముత్తయ్య చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు నేను చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఈ చిత్రంలో నా గెటప్‌ వుంటుంది. ఆల్‌ క్లాసెస్‌ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసే అన్ని ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో వున్నాయి” అన్నారు.

‘రాయుడు’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ అధినేత జి.హరి మాట్లాడుతూ – ”ఇటీవల రిలీజ్‌ చేసిన ‘రాయుడు’ ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విశాల్‌ కెరీర్‌లోనే చాలా డిఫరెంట్‌ ఫిల్మ్‌ అవుతుందన్న అప్రిషియేషన్‌ వస్తోంది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ విడుదలైంది. మే 11న ఈ చిత్రం ఆడియోను విడుదల చేస్తున్నాం. మే 20న ‘రాయుడు’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి” అన్నారు.
మాస్‌ హీరో విశాల్‌, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్‌.కె.సురేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమాన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఫైట్స్‌: అనల్‌ అరసు, డాన్స్‌: బాబా భాస్కర్‌, సమర్పణ: విశాల్‌, దర్శకత్వం: ముత్తయ్య.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus