Vishnu Vishal: తండ్రి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు విశాల్!

రానా నటించిన ‘అరణ్య’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఎఫ్ఐఆర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మను ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నారు.

Click Here To Watch

ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్రబృందం. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్ కి విష్ణు విశాల్ తండ్రి, పోలీస్ అధికారి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటిసారి ఓ సినిమా ఫంక్షన్‌కి గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉంది.

నా కొడుకు వల్లే ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నా కొడుకు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వారందరికి కృతజ్ఞతలు. వాళ్ల అభిమానం, ప్రేమ నా కొడుకుపై ఎప్పుడూ ఉండాలి. ఎఫ్ఐఆర్ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. స్టేజ్ పై తన తండ్రి స్పీచ్ విన్న విష్ణు విశాల్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో రేబా మోనికా జాన్‌ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రలో నటించారు. అశ్వంత్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus