Vishwak Sen: అభిమానులకు శుభవార్త చెప్పిన విశ్వక్ సేన్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తానని విశ్వక్ సేన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తన సినిమాలకు తానే దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా నన్ను నటుడిగానే కాకుండా మనిషిగా తీర్చిదిద్దిందని విశ్వక్ సేన్ అన్నారు.

ఈ సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలు కావడంతో ఈ సినిమా జ్ఞాపకాల గురించి విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. తనకు సపోర్ట్ గా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు అని ఆయన కామెంట్లు చేశారు. ఫలక్ నుమా దాస్ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తానని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. పార్ట్1 తో పోల్చి చూస్తే పార్ట్2 100 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అంగమాలి డైరీస్ సినిమాను తెలుగులో ఫలక్ నుమా దాస్ పేరుతో విశ్వక్ సేన్ తెరకెక్కించారు. నటుడిగా, డైరెక్టర్ గా విశ్వక్ సేన్ ఆడియన్స్ మెప్పు పొందారు. గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తానని పలు సందర్భాల్లో విశ్వక్ సేన్ పేర్కొన్నారు. దాస్ కా ధమ్కీ సినిమాకు కూడా సీక్వెల్ తీస్తానని విశ్వక్ సేన్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

దాస్ కా ధమ్కీ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. తను నటించిన సినిమాలకు ఈ హీరో 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. విశ్వక్ సేన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. విశ్వక్ సేన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. త్వరలో విశ్వక్ సేన్ (Vishwak Sen) మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus