Vishwak Sen: జగపతిబాబు ఫ్లాప్ మూవీలో విశ్వక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కోసం అత్యంత కష్టపడే హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ సేన్ అతి త్వరలో గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహా శివరాత్రి పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. మార్చి నెల 8వ తేదీన గామి సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.

అయితే విశ్వక్ సేన్ జగపతిబాబు హీరోగా తెరకెక్కిన బంగారుబాబు అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారట. విశ్వక్ సేన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో నటించినందుకు 900 రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కిందని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. బాల్యం నుంచి నాకు సినిమాలపై ఆసక్తి ఉందని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. జోష్ మూవీ అడిషన్స్ కు వెళ్లానని ఆ సినిమాలో ఛాన్స్ దక్కలేదని ఆయన అన్నారు.

బంగారు బాబు సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రను చెడగొట్టే పాత్రలో నేను కనిపించానని విశ్వక్ సేన్ వెల్లడించారు. ఒకే ఒక్కరోజు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నానని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు. విశ్వక్ సేన్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు. విశ్వక్ సేన్ గత సినిమా దాస్ కా ధమ్కీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

విశ్వక్ సేన్ నటనపై ఉండే ఆసక్తితో ఎంతో కష్టపడి చిన్న వయస్సులోనే స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. విశ్వక్ సేన్ భవిష్యత్తు సినిమాలతో సైతం భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విశ్వక్ సేన్ కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వక్ సేన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus