సినిమా బాగోలేదన్నవాళ్లందర్నీ తిట్టుకుంటూపోతే ఎలా ?

టీజర్, ట్రైలర్ తోనే విశేషమైన రెస్పాన్స్ అందుకుని, మంచి అంచనాలు క్రియేట్ చేసిన సినిమా “ఫలక్ నుమా దాస్”. మలయాళ సూపర్ హిట్ చిత్రం “అంగమలై డైరీస్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకుడు మరియు కథానాయకుడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ లభించింది. సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ తో విడుదలవ్వడంతో మంచి థియేటర్స్ దొరికాయి. నాని, రాణాలు సపోర్ట్ చేయడంతో మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది. కానీ.. ఆదివారం నుంచి ఈ సినిమా విషయంలో అనవసరమైన రచ్చ క్రియేట్ అయ్యింది.

విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సినిమా ప్రమోషన్ లో భాగంగా.. “సినిమా బాలేదు అని అంటున్నావాళ్లందరికీ ****** షేప్ అవుట్ అయిపోతుంది **************” అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ “నేను అన్నది కొందరిని మాత్రమే.. అందరినీ ఉద్దేశించి అనలేదు” అని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. ఒక దర్శకుడు మరియు కథానాయకుడు అయ్యుండి ఇలా పబ్లిక్ గా బూతులు మాట్లాడి సినిమాను ప్రమోట్ చేయడం అనేది మంచి పద్ధతి మాత్రం కాదు. మణిరత్నం సినిమాలే అందరికీ నచ్చవు, అలాంటిది విశ్వక్ సేన్ తీసిన ఒక రీమేక్ సినిమాకి ఇలా హడావుడి చేయడం అనేది అతడి కెరీర్ కి కానీ, రాబోయే సినిమాలకి కానీ అస్సలు మంచిది కాదు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus