Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ పారితోషికం అన్ని కోట్లా?

యంగ్ హీరో విశ్వక్ సేన్ సరైన కథలను ఎంపిక చేసుకుంటూ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్ చేరింది. ఈ సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు విశ్వక్ సేన్ రేంజ్ ను మరింత పెంచింది. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా ఈ సినిమా సక్సెస్ తో విశ్వక్ సేన్ కు కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

అయితే హీరో విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ను పెంచారని సమాచారం అందుతోంది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు 2 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. కొత్త సినిమాలకు విశ్వక్ సేన్ ఈ మొత్తం పారితోషికంగా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. క్రేజ్ ఉండగానే క్యాష్ చేసుకోవాలనే సామెతను విశ్వక్ సేన్ ఫాలో అవుతుండటం గమనార్హం.

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశ్వక్ సేన్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలు అందుకుంటారో చూడాలి. గత అనుభవాల నేపథ్యంలో విశ్వక్ సేన్ వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వివాదాల ద్వారా ప్రతిసారి సినిమాకు మేలు జరగదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గతంలో కూడా విశ్వక్ సేన్ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. విశ్వక్ సేన్ తో సినిమాలను నిర్మించాలని భావిస్తున్న నిర్మాతలు అతని రెమ్యునరేషన్ విని హడలిపోతున్నారని సమాచారం. విశ్వక్ సేన్ తర్వాత సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆయన రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus