Vishwak Sen: జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించబోతున్నాను: విశ్వక్ సేన్

  • August 14, 2023 / 07:40 PM IST

విశ్వక్ సేన్ పరిచయం అవసరం లేని పేరు. నటుగా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన తన సినిమాల ప్రమోషన్ లో భాగంగా పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. విశ్వక్ తన సినిమాలను చాలా విభిన్న రీతిలో ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక ఈయన చేసే వ్యాఖ్యలపై ఇలాంటి సందేహాలు తరచూ కలుగుతూనే ఉంటాయి. ఇకపోతే విశ్వక్ సేన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

త్వరలోనే తాను ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాను అంటూ ఈయన చేసిన పోస్ట్ చూస్తుంటే విశ్వక్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే సందేహాలు అందరికీ రాకమానదు అయితే ఈయన నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్లలో భాగమా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.విశ్వక్‌సేన్ విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే.. ‘నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు.. మీరు ఇన్నాళ్లుగా నాపై కురిపించిన ప్రేమకు, నాకిచ్చిన మద్దతుకు కృతజ్ఞుడిని.

ఇప్పుడు నా జీవితంలో మరో కొత్త దశలోకి ప్రవేశించబోతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఫ్యామిలీ మొదలుపెట్టబోతున్నాననీ తెలిపారు. ఇక ఆ ముఖ్యమైన విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే చెబుతానని తెలుపుతూ ఆ విషయాన్ని ఆగస్టు 15వ తేదీ తెలియజేయబోతున్నట్లు వెల్లడించారు.

దీంతో ఈయన (Vishwak Sen) నిజంగానే పెళ్లి గురించి ప్రకటించబోతున్నారా లేకపోతే ఏదైనా కొత్త సినిమా గురించి ప్రకటన చేయబోతున్నారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మరి ఈయన దేని గురించి చెబుతున్నారు అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus