Vishwak Sen: బాయ్‌కాట్‌ ట్రెండ్‌… మరోసారి రియాక్ట్‌ అయిన విశ్వక్‌సేన్‌.. ఏమన్నారంటే?

సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్శీ అవ్వడం.. ఆ నేపథ్యంలో సినిమా ప్రచారం భారీగా సాగడం విశ్వక్‌సేన్‌కు అలవాటు. ఆయన చేసిన సినిమాల్లో దాదాపు అన్నింటికీ ఇదే పరిస్థితి. తొలి రెండు సినిమాలు తప్పిస్తే.. ఏదో ఒక కాంట్రవర్శీ కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ‘లైలా’ (Laila)  సినిమాకు సంబంధించి అలాంటిదేమీ లేదు అని అనుకుంటుండగా.. ‘150 మేకలు.. 11 మేకలు’ టాపిక్‌ చర్చలోకి వచ్చింది. దీంతో ఏకంగా సినిమాను బ్యాన్‌ చేయండి అని ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున సోషల్‌ మీడియా ఉద్యమం నడుస్తోంది.

Vishwak Sen

ఈ విషయంలో ఇప్పటికే విశ్వక్‌  (Vishwak Sen), నిర్మాత సాహు గారపాటి (Sahu Garapati) ప్రెస్‌ మీట్‌ సారీ చెప్పి, క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ చూస్తుంటే ఈ విషయం ఇక్కడితో ఆగేలా లేదు. ఎందుకంటే ఆ మాటలు అన్న పృథ్వీ (Prudhvi Raj) .. వెనక్కి తగ్గడం లేదు. మళ్లీ ఏదో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ బాయ్‌కాట్‌ పోస్టులు బయటకు వచ్చాయి. అలాగే పైరసీ భూతం కూడా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో విశ్వక్‌సేన్‌ మరోసారి ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. తనను, తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దంటూ ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

సినిమా పోస్టర్లను షేర్‌ చేస్తూ.. ఈ పోస్టర్లు సినిమాకు సంబంధించినవి మాత్రమే. ఈ ఫొటోల్లో ఉన్నది సోనూ మోడల్‌. ఫిబ్రవరి 14న మీ ముందుకు వస్తున్నాడు అని రాసుకొచ్చారు. అంటే తమ సినిమాకు వేరే విషయాలతో సంబంధం లేదని చెప్పకనే చెప్పాడు. ఈ క్రమంలో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ గురించి కూడా మాట్లాడాడు విశ్వక్‌. నేను ప్రతిసారీ తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జరిగిన దానికి ఇప్పటికే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను. ఈ విషయంలో అతిగా ఆలోచించొద్దు.

అందరూ ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెబుతున్నాను, నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు అని విశ్వక్‌సేన్‌ రాసుకొచ్చాడు. విష్వక్‌సేన్‌ హీరోగా రామ్‌నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘లైలా’ ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని నటుడు పృథ్వీరాజ్‌ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

బ్రహ్మానందం పిలిస్తే రానని చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus