Vishwak Sen: వామ్మో.. విశ్వక్ సేన్ ధరించిన చెప్పుల ఖరీదు అన్ని వేలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో విశ్వక్ సేన్ ఒకరు. విశ్వక్ సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2024 సంవత్సరం మార్చి నెలలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో భారీ సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. సినిమా సినిమాకు విశ్వక్ సేన్ మార్కెట్ పెరుగుతోంది. చిన్న సినిమాలకు సపోర్ట్ చేసే విషయంలో సైతం విశ్వక్ సేన్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

బబుల్ గమ్ మూవీ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సందడి చేయగా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. రోషన్ తొలి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు ఫీలవుతున్నారు. ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ రావడంతో 18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే థియేటర్లలో ఈ సినిమా చూసే ఛాన్స్ ఉంది. అయితే బబుల్ గమ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ధరించిన బలెన్సియాగ హార్డ్‌క్రాక్స్ బ్రాండ్ చెప్పులు హైలెట్ గా నిలిచాయి.

ఈ లగ్జరీ సాండిల్స్ ఖరీదు ఏకంగా 98975 రూపాయలు కాగా చెప్పుల కోసం విశ్వక్ సేన్ ఆ రేంజ్ లో ఖర్చు చేశారని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. విశ్వక్ సేన్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ విజయాలను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. త్వరలో విశ్వక్ సేన్ మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు.

విశ్వక్ సేన్ (Vishwak Sen) పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. తన సినిమాలలో పాటలు స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న విశ్వక్ సేన్ మినిమం గ్యారంటీ హీరోలలో ఒకరిగా ఉన్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే విశ్వక్ సేన్ కు కెరీర్ పరంగా తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాసినిమాకు విశ్వక్ సేన్ రేంజ్ పెరుగుతోంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus