Vishwak Sen: విశ్వక్ మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయిందంటే..!

Ad not loaded.

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మొదటి నుంచీ అగ్రెసివ్ స్టైల్‌తో సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన అతను, యూత్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే, కేవలం హైప్ పైనే ఆధారపడి, కంటెంట్‌ను మర్చిపోతే, మార్కెట్ ఎలా దెబ్బతింటుందో అతని కెరీర్ చూస్తే అర్థమవుతోంది. విశ్వక్ తీసుకునే సినిమాల స్పీడ్‌ను చూస్తే మిగతా హీరోలందరికీ ఆదర్శంగా అనిపించొచ్చు.

Vishwak Sen

కానీ, అంతిమంగా హిట్లు కొట్టే సినిమాలు తీస్తేనే ఆ స్పీడ్‌ను కొనసాగించగలుగుతాడు. అతని తాజా సినిమా లైలా (Laila)  ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. అతని కెరీర్‌లోనే అత్యంత దారుణంగా నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓపెనింగ్ కలెక్షన్ల పరంగా కూడా దారుణంగా ఫెయిలైంది. ఇటీవల విడుదలైన సినిమాల ఓపెనింగ్స్‌ను చూస్తే, విశ్వక్ మార్కెట్ ఎంతగా పడిపోయిందో అర్థమవుతుంది. గతేడాది విడుదలైన గామి (Gaami) వరల్డ్ వైడ్ డే-1 రూ.8 కోట్ల కలెక్షన్లను సాధించింది.

అద్భుతమైన విజువల్స్, కొత్త కంటెంట్ ఆ సినిమాకు కలిసి వచ్చింది. అయితే, అదే ఊపు దాస్ కా దమ్కీ కు లేదు. టాక్ మిక్సడ్ అయినప్పటికీ, ఓపెనింగ్స్ పరంగా రూ.4.5 కోట్లతో బాగానే నిలబడింది. కాని, ఇదే టార్గెట్‌తో వచ్చిన మెకానిక్ రాకీ డీలా పడింది. యావరేజ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్స్ కేవలం రూ.1.5 కోట్లకే పరిమితం అయ్యాయి. ఇప్పుడు లైలా పరిస్థితి మరింత చేదుగా మారింది.

ఓపెనింగ్ డే వసూళ్లు కేవలం రూ.1.25 కోట్లు మాత్రమే రావడం విశ్వక్ మార్కెట్ ఎంతగా డీలా పడిందో స్పష్టం చేసింది. ప్రేక్షకుల నుంచి తిరిగి క్రేజ్ సంపాదించాలంటే, కేవలం హైప్‌కు ఆధారపడకుండా బలమైన కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. వరుసగా తక్కువ రేంజ్‌లోనే వసూళ్లు నమోదు కావడంతో, విశ్వక్ కు మునుపటి తరహా బాక్సాఫీస్ హవా తగ్గిందని స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ డౌన్‌ఫాల్ నుంచి బయటపడేందుకు అతను తీసుకునే తదుపరి నిర్ణయమే కీలకం కానుంది.

రెండోసారి తల్లి అవుతున్న స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోతో క్లారిటీ ఇచ్చి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus