మొన్న చిరు ఇప్పుడు విశ్వక్ సేన్…!

ఒకప్పుడు సినిమా వాళ్ళ జీవితాల్లో కాంట్రవర్సీలు ఉన్నప్పటికీ అవి జనాలకు తెలిసేవి కావు. సోషల్ మీడియా అంటే అప్పట్లో జనాలకు తెలియని రోజులు కాబట్టి.. సెలబ్రటీల ప్రైవసీకి భంగం కలిగేది కాదు. కానీ ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ప్రపంచం ఉంటుంది. కాబట్టి సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం చిన్న నెగిటివ్ పాయింట్ దొరికినా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకుంటారు. మరీ ముఖ్యంగా సెలబ్రటీలు వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

ఇది మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప స్టార్ హీరోలకు తెలియనిది కాదు. గరికిపాటి గారి విషయంలో మొదట సైలెంట్ గా ఉన్న చిరంజీవి.. ఈ మధ్యనే ఓ ఈవెంట్ కు వచ్చి ‘ఇక్కడ వారు లేరు కదా’ అంటూ మళ్ళీ పాత గాయాన్ని రేపి విమర్శలపాలయ్యారు. చిరంజీవి పెద్ద స్టార్ కాబట్టి.. ఆయనకు ఫరక్ పడదు. అయితే కుర్ర హీరో విశ్వక్ సేన్ కూడా పాత గాయాన్ని మళ్ళీ రేపే ప్రయత్నం చేశాడు.

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్లలో భాగంగా ఓ ప్రాంక్ వీడియో చేయడం, అది వివాదాస్పదమవ్వడంతో.. ఓ టీవీ ఛానల్ డిబేట్ కు పిలవడం, అక్కడ యాంకర్ విశ్వక్ ను రెచ్చగొడితే నోరు పారేసుకోవడం.. తర్వాత ఆమె ‘గెటౌట్ ఆఫ్ స్టూడియో’ అంటూ అనడం అందరికీ తెలిసిందే.

ఇప్పుడు విశ్వక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రం ట్రైలర్ లో ‘గెటౌట్ .. గెటౌట్ ఆఫ్ మై కార్’ అంటూ అలాంటి ఓ డైలాగ్ ను పెట్టాడు విశ్వక్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆ సినిమా ట్రైలర్లో ఈ డైలాగ్ హైలెట్ గా మారింది. దీంతో విశ్వక్ మళ్ళీ పాత గాయాన్ని రేపినట్టు అయ్యింది. మరి దీని పై ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus