Viva Harsha: ఆ సమస్య వల్లే లావయ్యానన్న వైవా హర్ష.. ఇప్పటికీ అలా చేస్తారంటూ?

  • February 19, 2024 / 11:21 AM IST

యూట్యూబ్ వీడియోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో వైవా హర్ష ఒకరు. వైవా హర్ష నటించిన సుందరం మాస్టర్ మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైవా హర్ష షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆస్తమా తగ్గడం కోసం చిన్నప్పుడు స్టెరాయిడ్లను వాడానని ఆయన తెలిపారు.

స్టెరాయిడ్లను వినియోగించడం వల్ల నేను బొద్దుగా అయ్యానని వైవా హర్ష పేర్కొన్నారు. స్కూల్ లో చదువుకునే సమయంలో లావుగా ఉన్నానని నన్ను ఏడిపించేవారని ఆయన తెలిపారు. రైలులో తల్లీదండ్రులతో వెళ్లాలన్నా భయంగా ఉండేదని వైవా హర్ష కామెంట్లు చేశారు. నా కలర్ గురించి ఎదుటివాళ్లు కామెంట్లు చేస్తారేమో అని నేను టెన్షన్ పడేవాడినని వైవా హర్ష వెల్లడించడం గమనార్హం.

కలర్ ఫోటో మూవీలో నటించే వరకు ఇండస్ట్రీకి వచ్చి ఏం చేస్తున్నాం అని అనుకునేవాడినని ఆయన కామెంట్లు చేశారు. బిల్స్ కట్టడం కోసం ఇష్టం లేకపోయినా పిచ్చి పిచ్చి పాత్రలు చేశానని వైవా హర్ష వెల్లడించారు. ఈ క్రమంలో అస్సలు ఇక్కడ ఉండాలనిపించేది కాదని ఆయన కామెంట్లు చేశారు. ఎక్కడికైనా పారిపోవాలనిపించేదని వైవా హర్ష చెప్పుకొచ్చారు. ఈ ఇండస్ట్రీకి వచ్చింది ఇది చేయడానికి కాదు కదా అని అనిపించిందని ఆయన తెలిపారు.

వైవా హర్ష (Viva Harsha) తనకు ఎదురైన అవమానాల గురించి కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో సెట్స్ లో నా శరీరం గురించి కలర్ గురించి కూడా జోకులు వేసేవారని వైవా హర్ష వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం వ్యక్తిగతంగా ఎవరూ కామెంట్ చేయకపోయినా డిజిటల్ మాధ్యమాలలో మాత్రం నాపై ఇప్పటికీ జోకులు వేస్తుంటారని వైవా హర్ష అన్నారు. వైవా హర్ష వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus