Viva Harsha: కొత్తింట్లోకి అడుగుపెట్టిన వైవా హర్ష… వైరల్ అవుతున్న ఫోటోలు!

హర్ష చెముడు.. ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదు. అదే వైవా హర్ష అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. ఆ షార్ట్ ఫిలిం ఇతన్ని ఎంత ఫేమస్ చేసిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇంకా ఎన్నో సక్సెస్ ఫుల్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఇప్పుడు వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. దాదాపు ఇతను అన్ని సినిమాల్లో కనిపిస్తున్నాడు అని చెప్పాలి. వెంకటేష్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘మసాలా’ చిత్రం నుండి మొన్నొచ్చిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ వరకు ఇతను దాదాపు అన్ని సినిమాల్లోనూ నటించాడు. ఇదిలా ఉండగా.. హర్ష పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.

హర్ష తండ్రి సత్యనారాయణ రావు ఓ బ్యాంక్ మేనేజర్. ఆయన మెగాస్టార్ చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్ కూడా..! మరోపక్క వైవా హర్షకి పెళ్ళైన సంగతి కూడా ఎక్కువ మందికి తెలిసుండదు. అక్షర అనే అమ్మాయిని ఇతను 2021 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా వైవా హర్ష కొత్తింట్లోకి ప్రవేశించాడు. అవును తనకంటూ సొంతిల్లు ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక తన కొత్తింటి గృహప్రవేశ వేడుకకు సాయి ధరమ్ తేజ్, వంటి సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఫొటోల్లో కానీ ఈ వేడుకలో కానీ వైవా హర్ష భార్య అయిన అక్షరనే ఎక్కువగా హైలెట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus