Prabhas: ఆ డైరెక్టర్ కావాలనే ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్నారా.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ వస్తే బాగుంటుందని వాళ్లు ఫీలవుతున్నారు. స్టార్ హీరో ప్రభాస్ వివాదాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మాత్రం ప్రభాస్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ద వ్యాక్సిన్ వార్ హిందీ వెర్షన్ విడుదల కానుండగా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కావడంలేదు. ముంబైలోని ఒక్క థియేటర్ లో కూడా ఈ సినిమాకు కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాలేదు. తన సినిమాకు పబ్లిసిటీ జరగడానికి వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ మరోమారు కామెంట్లు చేశారు. తనను ప్రభాస్ అభిమానులు బెదిరిస్తున్నారని తనతో పాటు తన కూతురిపై కూడా వాళ్లు అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

గతంలో వివేక్ అగ్నిహోత్రి సలార్ టీజర్ చెత్తగా ఉందని ప్రభాస్ కు యాక్టింగ్ రాదని ఇష్టానుసారం కామెంట్లు చేయడం జరిగింది. సలార్ కు పోటీగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నానని వివేక్ అగ్నిహోత్రి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ద కశ్మీర్ ఫైల్స్ సినిమాతో సక్సెస్ సాధించిన వివేక్ అగ్నిహోత్రి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తారేమో చూడాల్సి ఉంది. వివేక్ అగ్నిహోత్రి కామెంట్ల విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

ఏ ఆధారాలు లేకుండా ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus