‘బిగ్ బాస్5’ సెప్టెంబర్లో ఎంత గ్రాండ్ గా ప్రారంభమైందో… నిన్న అంతే గ్రాండ్ గా ముగిసింది. ఫినాలే ఎపిసోడ్ కు రాజమౌళి, నాని, నాగ చైతన్య వంటి సెలబ్రిటీల రాకతో షో మొత్తం కళ కళ లాడిపోయింది అనే చెప్పాలి. హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లో మొదట సిరి ఎలిమినేట్ అయ్యింది. తర్వాత మానస్ బయటకి వచ్చేసాడు. అటు తర్వాత శ్రీరామచంద్ర బయటకి వచ్చాడు. ఫైనల్ గా సన్నీ, షణ్ముఖ్ లు హౌస్ లో మిగలగా…
వారిని నాగ్ బయటకి తీసుకొచ్చాడు. వీరిలో ఎవరు విన్నర్ అవుతారు అనే ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఫైనల్ గా సన్నీ విన్నర్ అయినట్టు నాగార్జున ప్రకటించాడు. షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక సన్నీకి ప్రైజ్ మనీ రూ.50 లక్షలతో పాటు ఒక బైక్, సువర్ణ భూమి వారు ఓ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా.. సన్నీ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు గెలుచుకున్నప్పటికీ అందులో చాలా కోతలు జరిగాయట.
దీంతో ఫైనల్ గా అతను గెలుచుకున్న అమౌంట్ రూ. 34.40 లక్షలు మాత్రమే అని తెలుస్తుంది. కటింగ్ మొత్తం రూ.16 లక్షలు అయినట్టు తెలుస్తుంది. దానికి ప్రధాన కారణం… ఏదైనా షోలో పాల్గొన్నప్పుడు రూ.10 వేల కంటే ఎక్కువ గెలిస్తే అందులో 31.2% టాక్స్ చెల్లించాల్సి ఉంటుందట. అందుకే అతనికి వచ్చిన రూ. 50 లక్షల్లో.. రూ. 15.60 లక్షలు ఇన్కమ్ టాక్స్ కట్ అయినట్టు తెలుస్తుంది.
అయితే ప్రైజ్ మనీ కాకుండా హౌస్ లో 15 వారాలు కొనసాగినందుకు గాను.. అతనికి వారానికి రూ.1 లక్ష చొప్పున అందినట్టు తెలుస్తుంది. అందులో ఎంత కటింగ్లు ఉంటాయి అన్న విషయం మాత్రం బయటకి రాలేదు.