Bigg Boss Telugu 5 Winner: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నింగ్ మూమెంట్స్ ఇవే..! అసలు ఏం జరిగింది..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ నిలిచాడు. 100రోజుల జెర్నీలో హీరోగా ట్రోఫీని ముద్దాడాడు. బరిలో ఎన్నో కష్టాల నడుమ నిలిచి విన్నర్ గా కప్ ని గెలిచాడు. ఫస్ట్ నుంచీ కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న షణ్ముక్ జస్వంత్ ని దాటుకుంటూ మరీ ట్రోఫీని ముద్దాడాడు. రియల్ విన్నర్ రియల్ హీరో అంటూ సన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూ రెచ్చిపోతున్నారు. ఇన్ స్ట్రా గ్రామ్ లో వచ్చిన ఈ అప్డేట్ ని షేర్ చేస్తూ తెగ మురిసిపోతున్నారు.

నిజానికి అసలు బిగ్ బాస్ స్టేజ్ పైన ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, లైవ్ లో సన్నీ విన్నర్ అవుతున్నప్పుడు షణ్ముక్ ఇంకా సిరి ఎలా ఫీల్ అయ్యారు అనేది చూడాలని తెగ ఆరాటపడుతున్నారు సన్నీ ఫ్యాన్స్. ఫైనల్ గా సన్నీ ట్రోఫీని తీస్కోవడం, ఆ స్టేజ్ పైన గోల్డెన్ మూమెంట్స్ ని చూసేందుకు ఉత్సాహపడుతున్నారు. ఫినాలే ఎపిసోడ్ లో ముందుగా సిరిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ టీమ్ ఆ తర్వాత మానస్ ని ఎలిమినేట్ చేసింది.

ఇక ఆ తర్వాత అత్యంత నాటకీయంగా సాగిన ఫినాలే ఎపిసోడ్ లో స్టేజ్ పైకి వచ్చిన షణ్ముక్ ఇంకా సన్నీలలో సన్నీ చేతిని పైకి లేపి విజేతగా ప్రకటించాడు కింగ్ నాగార్జున. దీంతో సన్నీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మూమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ అందరిలోనూ ఉత్సుకతని కలిగిస్తోంది. 100 రోజులు పాటు సన్నీ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని, నిజమైన ప్లేయర్ గా తను బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడాడు అని మాజీ కంటెస్టెంట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus