దర్శకుడు వి.వి.వినాయక్ 19 ఏళ్ళ వయసు కూడా నిండని ఎన్టీఆర్ ను హీరోగా పెట్టి ‘ఆది’ అనే బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. 2002 వ సంవత్సరంలో విడుదలైన ‘ఆది’ చిత్రం ఎన్నో ఆల్ టైం రికార్డులను సృష్టించింది. ఓ విధంగా ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ సినిమా తీయడానికి కారణం ‘ఆది’ నే అని దర్శకుడు రాజమౌళి కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ‘ఆది’ చిత్రం చూసిన తర్వాత చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్ద స్టార్లు కూడా వినాయక్ తో సినిమా చేయాలని ఆశ పడ్డారు అంటే ఆ చిత్రం ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే 2004వ సంవత్సరం జూన్ 9న ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్లో ‘సాంబ’ అనే మరో చిత్రం వచ్చింది. ఈరోజుతో ఆ చిత్రం విడుదలై 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ‘ఆది’ కాంబినేషన్ కావడంతో రిలీజ్ కు ముందు ‘సాంబ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు బిజినెస్ కూడా భారీగా జరిగింది. కానీ ‘సాంబ’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. యావరేజ్ మూవీగా నిలిచింది. ఇది కూడా సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రమే..! ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో దర్శకుడు వినాయక్ కు నచ్చని ఓ సీన్ ఉందట. అది చాలా ఆడ్ గా అనిపించడంతో చిత్రీకరణ సమయంలో ఆ సీన్ వద్దని పక్కన పెట్టాడట. కానీ యూనిట్ సభ్యులు చాలా మంది ఆ సీన్ పెట్టొచ్చు..
బానే ఉంది అని ఫోర్స్ చేయడంతో ఇష్టం లేకపోయినా ఆ సీన్ ను షూట్ చేసినట్లు వినాయక్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.అయితే రిలీజ్ రోజున ‘సాంబ’ థియేటర్ లో ఆ సీన్ చూసినప్పుడు కొంతమంది విమర్శించారట. దీంతో ‘అనవసరంగా ఆ సీన్ పెట్టానే’ అని ఫీలయ్యాడట వినాయక్. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. ‘సాంబ’ లో హీరో అక్క భర్త అన్నయ్య అయిన విలన్(ప్రకాష్ రాజ్) పొలం కోసం ఆమెను వేధిస్తాడు. అంతేకాదు అతని తమ్ముడి తో కూతురితో సమానమైన తమ్ముడి భార్య పై అత్యాచారం చేయించే విధంగా రెచ్చగొడతాడు. అప్పుడు విలన్ భార్య అడ్డుకుంటే … ‘నువ్వు ఓవర్ యాక్షన్ చేయకే.. వాడు నీ మీదికి వచ్చాడనుకో ఆపడం నా వల్ల కూడా కాదు’ అంటూ బెదిరిస్తాడు. ఈ సీన్ పై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయట. దీంతో వినాయక్ బాధ పడినట్లు స్పష్టమవుతుంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!