Vv Vinayak: ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ లో స్టార్ డైరెక్టర్ రోల్ పై క్లారిటీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా లు హీరోలుగా.. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.’సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పై మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ నెలకొంది.’అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు రాస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నమోదైనట్టు స్పష్టమవుతుంది.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.అయితే జూలై మొదటి వారం నుండీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ‘ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా నటిస్తున్నారు’ అంటూ మొన్నామధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై తాజాగా వినాయక్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్ గారు, రానా నటిస్తున్న చిత్రంలో నేను కూడా చిన్న భాగమైనందుకు ఆనందంగా ఉంది.

ఈ సినిమాలో నేను కాసేపు డైరెక్టర్ గా కనిపిస్తాను. నా పాత్ర ఎక్కువ సేపు కనిపించదు. కానీ ఇది చాలా మంచి కథ.. ఇందులో నటించే ఛాన్స్ లభించినందుకు హ్యాపీగా ఫీలవుతున్నాను’ అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus