VV Vinayak: వినాయక్ కొత్త సినిమా ఆగిపోయింది!

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు వి.వి.వినాయక్. గతంలో ఆయన తీసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వినాయక్ తీసిన సినిమాలు ఆడియన్స్ ను కట్టిపడేశాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన దర్శకుడిగా రాణించలేకపోతున్నారు. ఆయన డైరెక్ట్ చేస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో ‘ఛత్రపతి’ సినిమా రీమేక్ ను తెరకెక్కిస్తున్నారు.

ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. వి.వి.వినాయక్ కు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదివరకు దిల్ రాజు ఓ స్క్రిప్ట్ తో వినాయక్ ను సంప్రదించారు. పాత్రకు తగ్గట్లుగా బరువు కూడా తగ్గారు వి.వి.వినాయక్. కానీ కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వినాయక్ హీరోగా సినిమా క్యాన్సిల్ అయిపోయింది.

ఆ తరువాత తమిళ సినిమా రీమేక్ హక్కులను కొన్నారు వినాయక్. అందుకే తనే మెయిన్ లీడ్ లో నటించాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ నచ్చకపోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఈ రీమేక్ సినిమా కోసం రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టారట వినాయక్.

ఇప్పుడు ఆ డబ్బు మొత్తం వృధా అయినట్లే. ఇండస్ట్రీలో నటుడిగా రాణించాలనుకుంటున్న వినాయక్ కి ఆయన కల నెరవేరేలా మాత్రం కనిపించడం లేదు. దర్శకుడిగా ఆయన బాగానే సంపాదించారు. ఆయన హ్యాపీ స్పేస్ లోనే ఉన్నారు. అయినప్పటికీ ఇండస్ట్రీలోనే ఏదొక వర్క్ చేయాలని భావిస్తున్నారాయన. అందుకే ఇన్ని ప్రయత్నాలు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus