Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ను ప్రీపోన్ చేయబోతున్నారా?

2023 సంక్రాంతికి ‘ఆదిపురుష్’ ‘వారసుడు'(వరిసు) ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ఆల్రెడీ అధికారిక ప్రకటనలు వచ్చాయి. మధ్యలో పంజా వైష్ణవ్ తేజ్ మూవీ కూడా ఉందన్నారు. అయితే అనూహ్యంగా సంక్రాంతి రేసు నుండి ‘ఆదిపురుష్’ తప్పుకుంది.శ్రీరామనవమి కానుకగా మార్చి 30న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అంటున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇప్పుడు అందరి దృష్టి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ ల పైనే పడింది.

ఎందుకంటే సంక్రాంతికి చిరు- బాలయ్య సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే ఆ కిక్కే వేరు అని ఫ్యాన్స్ భావిస్తారు. మారిన కాలాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు స్టార్ హీరోలు అనలేము కానీ మిడ్ రేంజ్ హీరోల కంటే వీళ్ళ మార్కెట్ ఎక్కువే. సంక్రాంతి సీజన్ స్పెషల్ కాబట్టి ఈ రెండు సినిమాల మధ్య పోటీ కూడా స్పెషలే. నిజానికి చిరు మార్కెట్ బాలయ్య మార్కెట్ డబుల్ ఉంటుంది. కానీ ఈ మధ్య చిరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు.

మరోపక్క బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కాబట్టి ‘వీర సింహారెడ్డి’ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. బిజినెస్ కూడా చిరు సినిమాతో సమానంగా బాలయ్య సినిమాకి జరుగుతుంది. ఇక్కడ ఈ రెండు సినిమాలకు ఒకరే నిర్మాత కాబట్టి.. పెద్ద సమస్య వచ్చి పడింది అని చెప్పాలి. బయ్యర్స్ వీళ్ళ పై ఒత్తిడి పెడుతున్నారు. ఒక సంస్థలో రూపొందిన రెండు పెద్ద సినిమాలకు థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టం.

బిజినెస్ జరిగిన దాన్ని బట్టి థియేటర్లు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే ‘వీర సింహారెడ్డి’ ని జనవరి 11,12 తేదీల్లో దింపి.. ‘వాల్తేర్ వీరయ్య’ ని జనవరి 5,6 తేదీల్లో రిలీజ్ చేయాలని ‘మైత్రి’ సంస్థ భావిస్తోందట. అప్పుడు చిరు సినిమాకి ఇబ్బంది ఉండదు. ఎక్కువ థియేటర్లలో చిరు సినిమా రిలీజ్ అవుతుంది. ‘వీర సింహారెడ్డి’ రిలీజ్ అయ్యే రోజుకి బాలయ్యకు కూడా థియేటర్లు అడ్జస్ట్ చేయొచ్చు అనేది నిర్మాతల ప్లాన్ గా తెలుస్తుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus