Chiru, Balayya: చిరు, బాలయ్య సినిమాల తెలుగు రాష్ట్రాల హక్కులు అన్ని రూ.కోట్లా?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో విడుదలవుతున్నాయి. మొదట వీరసింహారెడ్డి మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా వాల్తేరు వీరయ్య మూవీ 13వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాల హక్కులను నైజాం మినహా ఇతర ఏరియాలలో గత సినిమాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు మైత్రీ నిర్మాతలు ఇచ్చారని తెలుస్తోంది.

నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ సిస్టమ్ కింద అన్ని ఏరియాలలో ఈ సినిమా హక్కులను విక్రయించారని సమాచారం. వాల్తేరు వీరయ్య సినిమా బడ్జెట్ 140 కోట్ల రూపాయలు కాగా వీరసింహారెడ్డి మూవీ బడ్జెట్ 110 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య సినిమాకు రెమ్యునరేషన్లు ఎక్కువ కావడంతో ఈ సినిమాకు ఎక్కువ మొత్తం బడ్జెట్ ఖర్చు అయిందని సమాచారం అందుతోంది.

వాల్తేరు వీరయ్య నైజాం హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడవగా వీరసింహారెడ్డి నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా. వాల్తేరు వీరయ్య సీడెడ్ హక్కులు 14.5 కోట్ల రూపాయలకు, వీరసింహారెడ్డి సీడెడ్ హక్కులు 12.5 కోట్ల రూపాయలకు ఇచ్చారని సమాచారం అందుతోంది. ఆంధ్ర హక్కుల విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య హక్కులు 40 కోట్ల రూపాయలకు, వీరసింహారెడ్డి హక్కులు 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల హక్కులు 135 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కనీసం 140 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తే ఈ రెండు సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి. ఈ రెండు సినిమాల ఫలితాల కోసం ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags