Wanted Pandu God Review: వాంటెడ్ పండుగాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘పుష్ప’ సినిమాలో సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో నటిస్తే అతని భార్య దాక్షాయణి గా అనసూయ నటించింది. ఆ సినిమాలో వీళ్లిద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ కు క్రేజ్ పెరిగింది. ఇదే కాంబినేషన్లో ‘దర్జా’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ‘వాంటెడ్ పండుగాడ్’ అనే మరో సినిమా కూడా వచ్చింది. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ‘పుష్ప’ కంటే ముందే స్టార్ట్ అయ్యింది..

కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ డిలే అయ్యింది. రాఘవేంద్రరావు వంటి స్టార్ డైరెక్టర్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడం..అనసూయతో పాటు దీపికా పిల్లి, విష్ణు ప్రియ వంటి భామలు సినిమాలో ఉండడంతో గ్లామర్ కు కొదువ ఉండదు అని ప్రేక్షకులు భావించారు. మరి సినిమా ఏ రేంజ్లో ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : పండుగాడు(సునీల్) జైలు నుండి ఎస్కేప్ అవుతాడు.ఈ క్రమంలో అతను పోలీసులతో పాటు మాఫియా వారికి కూడా టార్గెట్ అవుతాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయి చివరికి అతన్ని పట్టిచ్చిన వారికి కోటి రివార్డ్ ప్రకటిస్తారు. ముందుగా ఈ విషయాన్ని సు(సుధీర్), డీ(దీపికా పిల్లి) అనే రిపోర్టర్స్‌ కు తెలుస్తుంది.

తర్వాత మిగిలిన క్యారెక్టర్స్ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని కోటి రూపాయల కోసం పండుని పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు. అందుకోసం అడవుల్లో పడి తిరుగుతూ ఉంటారు.వీరిలో పండును పట్టుకొని కోటి రూపాయలు కొట్టింది ఎవరు? అసలు పండు జైలుకు వెళ్లడానికి కారణాలు ఏంటి? వంటిది మిగిలిన కథాంశం.

నటీనటుల పనితీరు : సునీల్ , అనసూయతో పాటు బ్రహ్మానందం, రఘుబాబు,30 ఇయర్స్ పృథ్వి, హేమ, ‘సుడిగాలి’ సుధీర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, విష్ణు ప్రియ, దీపికా పిల్లి వంటి వారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో సునీల్, అనసూయ కి తప్ప ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఏమీ లేవు.

అయినప్పటికీ ప్రధాన పాత్రల నటన కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉండదు. బహుశా కథలో సీరియస్ నెస్ లోపించడం వల్ల అనుకుంట. సునీల్ మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు కానీ… గుర్తుండి పోయే పాత్రలు చేయడం లేదు. అనసూయ, విష్ణు ప్రియ వంటి వారు స్కిన్ షో కి సరిపోయారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఈ సినిమా చూస్తున్నంత సేపు బుల్లితెర కామెడీ షోలు అయిన ‘జబర్దస్త్’ ‘కామెడీ స్టార్స్’ వంటి వాటికి ఎక్స్టెండెడ్ వెర్షన్ లా కనిపిస్తుంది తప్ప సీరియస్ ప్లాట్ ఉండదు. దర్శకుడు శ్రీధ‌ర్ సీపాన గతంలో ఈవీవీ గారు తెరకెక్కించిన ‘ఎవడి గోల వాడిదే’ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ కథని రాసుకున్నాడేమో అనిపిస్తుంది. అయితే ఈవీవీ గారే ‘బురిడి’ అనే సినిమా తీసి బోల్తా పడ్డ సందర్భాన్ని మర్చిపోయాడేమో. సినిమాకి పిల్లర్స్ లా నిలబడింది నిర్మాతలు ఒకరైతే… హీరోయిన్ల నడుము అందాలను, అడవుల నేపధ్యాన్ని చక్కగా చూపించిన సినిమాటోగ్రాఫర్ మహి రెడ్డి మరొకరు.

సంగీతం, నేపథ్య సంగీతం కూడా తెగ విసిగిస్తుంది అనే చెప్పాలి. కె. రాఘవేంద్ర రావు గారు దగ్గరుండి ఇలాంటి ఫేడౌట్ అయిపోయిన కథలను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అనే ప్రశ్న సినిమా ఆరంభం నుండి ముగింపు వరకు మైండ్లో తడుతూనే ఉంటుంది.సినిమా క్వాలిటీని బట్టి నిర్మాతలకు సినిమా పై గట్టి ప్యాషన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి సిల్లీ కామెడీ సినిమాలను కాకుండా మంచి కంటెంట్ బేస్డ్ మూవీస్ కు వాళ్ళు పనిచేస్తే ఇంకా బాగుంటుంది.

విశ్లేషణ : ఫోర్స్డ్ కామెడీ ఉన్నా సరే చూసి టైం పాస్ చేస్తాము అనుకునే వాళ్ళు తప్ప… మిగిలిన వాళ్ళు ఈ సినిమాని హ్యాపీగా లైట్ తీసుకోవచ్చు.

రేటింగ్ : 2/5

Share.