పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). అసలు ఫినిష్ అవుతుందా? లేదా? అనే రోజుల నుండి మొత్తానికి మంచి బజ్ తో రిలీజ్ అయ్యే స్థాయికి ఈ సినిమా వచ్చింది. 5 ఏళ్ళ పాటు ఈ సినిమా సెట్స్ పై ఉంది. క్రిష్ దర్శకత్వంలో మొదలైంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయ్యింది. ఏ.ఎం.రత్నం ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాని రిలీజ్ చేశారు. మొదటి నుండి ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ కామెంట్స్ ఆగాయి. అసలు ఈ సినిమాని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించని బయ్యర్స్.. మొత్తానికి ఫ్యాన్సీ రేట్లు చెల్లించి సినిమాని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారు. జూలై 24 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ సినిమా. ప్రమోషన్స్ డోస్ కూడా పెంచారు.
తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. రన్ టైం 2 గంటల 42 నిమిషాలు వచ్చింది. మరోపక్క ఈ చిత్రం చూసిన తర్వాత సెన్సార్ వారు టీంని ప్రశంసించారట.
సరైన టైంలో.. పవన్ కళ్యాణ్ కి సరైన సినిమా పడుతుందని, సినిమాలో విజువల్స్ అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయని వారు అభిప్రాయపడినట్లు టాక్ నడుస్తుంది. అలాగే బయ్యర్స్ కూడా ఈ చిత్రాన్ని వీక్షించి బాక్సాఫీస్ దాహం తీర్చే సినిమా అవుతుంది అని భరోసాతో నిర్మాతకి అడ్వాన్సులు ఇచ్చి వెళ్లినట్టు టాక్ వినిపిస్తుంది.