హృతిక్ రోషన్ (Hrithik Roshan) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కలిసి నటిస్తున్న ‘వార్ 2’ (War 2) సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. కానీ, తెలుగు థియేటర్ హక్కులు ఇప్పటివరకు ఎవరికీ ఖరారు కాలేదని తాజా సమాచారం.
‘వార్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యష్ రాజ్ ఫిల్మ్స్, ఈ సీక్వెల్‌తో మరోసారి రికార్డులు బద్దలు కొట్టాలని చూస్తోంది. ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిమాండ్ ఆకాశాన్నంటింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆసియన్ సురేష్ బాబు వంటి టాప్ నిర్మాణ సంస్థలు ఈ హక్కుల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. కొందరు నిర్మాత నాగవంశీ ఈ హక్కులు దక్కించుకున్నారని పుకార్లు వచ్చినా, ఆయన ఆ వార్తలను ఖండించారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2’ హక్కుల కోసం ఈ పోటీ ఉండటానికి కారణం ఎన్టీఆర్ క్రేజ్, హృతిక్ రోషన్ మాస్ అప్పీల్, అయాన్ ముఖర్జీ బ్రాండ్ వాల్యూ. ‘దేవర’ (Devara) సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్, ఈ సినిమాతో మరోసారి సందడి చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. హక్కుల కోసం భారీ ఆఫర్లు రావడంతో యష్ రాజ్ ఫిల్మ్స్ జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటోందని సమాచారం.
ఈ హక్కుల రేసులో ఎవరు గెలుస్తారనేది త్వరలో తేలనుంది. అభిమానులు మాత్రం ‘వార్ 2’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీలో ఒకేసారి రిలీజ్ కానుంది, ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే అవకాశం ఉంది. ఇక థియేటర్ హక్కుల విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.