బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్య వార్

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ  పోటీకి దిగారు. ఇద్దరు విజయాలను సాధించారు. ఈ ఏడాది బాలయ్య మరో మారు మెగా హీరోతో పోటీపడనున్నారు. అయితే ఈ సారి ప్రత్యర్థి  చిరు కాదు అతని తమ్ముడు పవన్. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. పూరి, బాలయ్య చిత్రం మొదలు పెట్టినప్పుడే సెప్టెంబర్ 29 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ తేదీలో మార్పు లేదు. ఇక పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తరవాత త్రివిక్రమ్ డైరక్షన్లో సినిమా చేయనున్నారు. ఈ ఫిల్మ్ ఏప్రిల్ 7 వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే ఈ చిత్రాన్ని  సెప్టెంబర్ 29 న విడుదల చేయాలనీ నిర్మాత రాధాకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమయితే  పోటీ రసవత్తరంగా ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ పోటీలో గెలుపు ఎవరిదో?


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus