Bigg Boss 7 Telugu: థామినీ – గౌతమ్ లతో గొడవ..! అసలు ఎందుకు గొడవ పడిందో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో అనూహ్యంగా మాయాస్త్రం టాస్క్ మలుపులు తిరిగింది. మాయాస్త్రం టాస్క్ లో గెలిచిన రణధీర గ్రూప్ ( శివాజీ, షకీల, ప్రియాంక, అమర్, ప్రిన్స్ , శోభాశెట్టి ) వీళ్లలో పవర్ అస్త్రాన్ని ఎవరు సాధిస్తారో డిసైడ్ చేసే ప్రక్రియ ఆపోజిట్ టీమ్ అయిన మహాబలి టీమ్ ( రతిక, తేజ, గౌతమ్, థామిని, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ ) పై పెట్టాడు బిగ్ బాస్. దీంతో హౌస్ లో అలజడి చెలరేగింది. ముఖ్యంగా రతిక సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. తను గేమ్ ఛెంజర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో తన ఓటింగ్ పొజీషన్ కోసం గోల గోల చేసింది.

అసలు మేటర్లోకి వెళితే., రణధీర టీమ్ లో ఏ ఇద్దరు గెలవాలో డిసైడ్ చేయాలని వాళ్లకి ఇచ్చిన మాయాస్త్రంలోని పార్ట్స్ ని తీసుకుని అదే గ్రూప్ లో వేరే వాళ్లకి ఇచ్చి సరైన రీజన్ చెప్పాలని బిగ్ బాస్ మహాబలి టీమ్ ని ఆదేశించాడు. దీంతో అలజడి స్టార్ట్ అయ్యింది. ఏ ఇద్దరికీ ఇవ్వాలో మహాబలి టీమ్ డిసైడ్ చేసేందుకు చర్చలు మొదలుపెట్టింది. ఇందులో రతిక అయితే శివాజీకి ఇస్తే నామినేషన్స్ లో ఎలాగో సేఫ్ అవుతాడు కాబట్టి ఆ తర్వాత మిగతా వాళ్లు ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చని చెప్పింది. ఇక్కడ క్లియర్ గా ప్రిన్స్ ఎలిమినేట్ అవుతాడని డిసైడ్ చేసినట్లుగానే అనిపిస్తోంది.

ఇంకోటి ఏంటంటే., శివాజీకి ఇమ్యూనిటీ తనవల్లే వస్తే తనకి క్రేజ్ పెరుగుతుంది. 4వారాలు శివాజీ సేఫ్ అయితే, శివాజీ ఫ్యాన్స్ ఓట్లు తనవైపు తిప్పుకోవచ్చనే మాస్టర్ ప్లాన్ వేసింది రతిక. అందుకే, తను లాస్ట్ లో వెళ్లి ఓటు వేసి గేమ్ ఛేంజర్ అవ్వాలని అనుకుంది. ఈవిషయాన్ని సూటిగా చెప్పకుండా నేను వెళ్లను అంటూ గోల చేసింది. గౌతమ్, తేజ, థామినీ కన్విన్స్ చేస్తున్నా, ఆర్గ్యూ చేస్తున్నా, అరిచి గోల చేస్తున్నా పట్టించుకోలేదు. తను పట్టిన కుందేళ్లకి మూడే కాళ్లు అని వాదించినట్లుగా అందరితో వాదించింది. పిచ్చి పట్టినదానిలా మాట్లాడింది. అయితే, థామిని క్యాజువల్ గా అన్నమాటలు కూడా సీరియస్ గా తీస్కుని వాదన పెట్టుకుంది.

రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు అని, నువ్వు వాయిస్ రైజ్ చేస్తే నీకంటే ఎక్కువ అరుస్తాను అంటూ థామినిపైకి ఎగిరింది. అంతేకాదు, నా పొజీషన్ చెప్పడానికి మీరు మీరు ఎలా డిసైడ్ చేస్తారంటూ అందర్నీ నిలదీసింది. సంచాలక్ అయిన సందీప్ చెప్పినా, బిగ్ బాస్ ఘంట మోగించినా కూడా రతిక వినిపించుకోలేదు. మొదట్లో టేస్టీ తేజ గ్రూప్ గా డిసైట్ చేసేటపుడు ప్రిన్స్ కి ఇమ్యూనిటీ ఇవ్వాలని అన్నాడు. అలాగే, గౌతమ్ శివాజీకి ఇచ్చేలా నేను లాస్ట్ లో గేమ్ చేంజ్ చేస్తానని రతికని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, రతిక ఆ ఛాన్స్ ఏదో నాకే ఇమ్మని చెప్పింది. కానీ గౌతమ్ , తేజ ఇద్దరూ కూడా పట్టించుకోలేదు.

దీంతో తిక్కరేగిన రతిక మొండి పట్టు పట్టుకుని కూర్చుంది. సంచాలక్ సందీప్ చెప్పినా వినలేదు. ఆఖరికి బిగ్ బాస్ ఈ ఆప్షన్ ని రణధీర టీమ్ కి ఇచ్చాడు. చివరకి రతిక తన పంతం నెగ్గించుకుంది. థామినీతో, సందీప్ తో, గౌతమ్ తో, టేస్టీ తేజతో ఆర్గ్యూ చేసింది. ఇక్కడే టీమ్ మెంబర్స్ అందరూ బఫూన్స్ అంటూ మాట్లాడింది. ఛండాలంగా అనిపిస్తోంది ఈ టీమ్ తో ఆడుతుంటే అంటూ అసహనాన్ని ప్రదర్శించింది రతిక. దీంతో రతికని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. (Bigg Boss 7 Telugu) ఫస్ట్ వీక్ లో తెచ్చుకున్న క్రేజ్ ని ఒక్కసారిగా పాడుచేసుకుందని కామెంట్స్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus