Krishnam Raju: కోనసీమలో కృష్ణంరాజు వ్యాక్స్ విగ్రహం.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కాలం చేసిన సంగతి తెలిసిందే.కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన సెప్టెంబర్ 11 న మరణించారు. 1940లో మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు తొలినాళ్లలో జర్నలిస్ట్ గా పనిచేసేవారు.అటు తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. అప్పట్లో సీనియర్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారి డామినేషన్ ఎక్కువగా ఉండడంతో.. ఆయనే సొంత బ్యానర్ ను స్థాపించి తన తమ్ముడు సూర్య నారాయణ రాజుతో కలిసి సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యారు.

అలా చేసిన కొన్ని చిత్రాల ద్వారా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు కృష్ణంరాజు గారు. అటు తర్వాత పారిశ్రామిక వేత్తగా కూడా మారినా.. పెద్దగా రాణించలేకపోయారు.అటు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.మంత్రి అయ్యారు.. ప్రజలకు ఎంతో సేవ చేశారు.కృష్ణంరాజు గారికి వారసుడు లేడు ఇక చిత్ర పరిశ్రమ అతన్ని మర్చిపోతుంది అనుకున్న టైంలో ప్రభాస్ ను హీరోగా పరిచయం చేశారు. అతను ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. కృష్ణంరాజు దశదిన కర్మ కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆయన వ్యాక్స్ విగ్రహం(మైనపు బొమ్మ)ను సిద్ధం చేశారు అక్కడి జనాలు. ఆయన పై ఉన్న అభిమానంతో అక్కడి జనాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తపేటలోని ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ ని సంప్రదించి కృష్ణంరాజు మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. కేవలం నాలుగు రోజుల్లోనే కృష్ణంరాజు మైనపు బొమ్మను తయారు చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

కృష్ణంరాజు దశదిన కార్యక్రమంలో శిల్పి రాజ్ కుమార్ వడయార్ ఈ విగ్రహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు సమాచారం. ఈ నెల 23న జూబ్లీహిల్స్, హైదరాబాద్ లోని కృష్ణంరాజు స్వగృహంలో దశదిన కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించబోతున్నారు. కృష్ణంరాజు వ్యాక్స్ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus