“వీకెండ్ పార్టీ” చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన  ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

బి.జె క్రియేషన్స్, ఫోర్త్ ఆల్ థియేటర్ సంస్థలు సంయుక్తంగా బోయ చేతన్ బాబు నిర్మాణ సారథ్యంలో అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “వీకెండ్ పార్టీ”. పాశం నరసింహారెడ్డి,పాశం కిరణ్ రెడ్డి, ఎన్ రేఖ iiసహనిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ సినిమా 1990వ దశకం లో జరిగినటువంటి ఒక యదార్థ సంఘటన ఆధారంగా అమరుడు బోయ జంగయ్య “అడ్డదారులు” అనే రచన ఆధారంగా ‘వీకెండ్ పార్టీ”తెరకెక్కించారు.

Click Here To Watch

సదా చంద్ర సంగీతం సమకూర్చిన ఈ సినిమా కు చంద్ర బోస్, కాసర్ల శ్యామ్, సదా చంద్ర లు సాహిత్యం సమకూర్చారు. అద్దంకి రాము సినిమాటోగ్రఫీ అందించగా సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రాఫర్ గా చేశారు. వేముల వెంకట్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నలుగురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం తో ఒక వీకెండ్ సాగర్ కి వెళ్లగా అక్కడ ఏవిధమైన పరిస్థులను ఎదురుకున్నారు అనేది సినిమా కథ. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి విడుదల చేశారు

ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. వీకెండ్ పార్టీ చిత్రం కథ అద్భుతంగా ఉంది. దర్శకుడు మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినందుకు ఎంతో గొప్పగా ఉంది. అన్నారు.

దర్శకుడు డైరెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమా పై నాపై నమ్మకం పెట్టుకుని తెరకెక్కించిన నిర్మాత గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడానికి వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా లో మంచి నటీనటులు నటించారు. తప్పకుండా అందరిని మెప్పిస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.. అన్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus