Pawan Kalyan: పవన్‌తో శ్రీలీల… రవితేజలా మార్పు చూపిస్తారా? లేకపోతే…?

కుర్ర హీరోయిన్‌ – కాస్త ఏజ్‌ హీరో.. ఈ కాంబినేషన్‌ను సినిమాల్లో చాలాసార్లు చూశాం. బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇలా కాంబినేషన్‌ అంటారు కానీ.. టాలీవుడ్‌లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇకపై ఉంటాయి కూడా. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చర్చకు వచ్చిందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా ఓసారి గుర్తు చేసేలా ఉండాలి అనుకుంటూ.. పవన్‌ కల్యాణ్‌ – శ్రీలీల గురించి అని చెబుతున్నాం. పవన్‌ కల్యాణ్‌ నెక్స్ట్‌ మూవీ ‘ఓజీ’ (వర్కింగ్‌ టైటిల్‌)లో శ్రీలీల నాయికగా నటిస్తోందని వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు ఓకే చేసి, షూటింగ్‌లు మొదలుపెట్టే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ‘వినోదాయ చిత్తాం’ సినిమా షూటింగ్‌ మొదలైంది కూడా. త్వరలో సుజీత్‌ – డీవీవీ దానయ్యల సినిమా స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు. ఎందుకంటే సుముద్ర ఖని సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌ 20 రోజులే అని టాక్‌. దీంతో ప్రస్తుతం సుజీత్‌ కాస్ట్‌ అండ్‌ క్రూ ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారట.

అందులో భాగంగానే శ్రీలీల పేరు బయటకొచ్చింది. దీంతో ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ అంటూ లెక్కలేస్తున్నారు. అయితే దానికి పవన్‌ అభిమానుల నుండి గట్టి కౌంటర్‌ కూడా వస్తోంది. టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్‌ టైమ్‌ అనేలా ఫీల్ అవుతున్నారేంటి.. గతంలోనూ ఇలా ఏజ్‌ గ్యాప్‌ చాలా ఉన్న కాంబినేషన్‌లు చూశాం కదా అని గుర్తు చేస్తున్నారు. అంతెందుకు ‘ధమాకా’లో రవితేజతో శ్రీలీల నటించలేదా అని అడుగుతున్నారు.

అలాగే గతంలో వచ్చిన అందులో నటించిన హీరోహీరోయిన్ల ఏజ్‌ గ్యాప్‌లను లెక్కేసి ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటే విషయం.. గ్యాప్‌ ఎక్కువైనా లుక్‌లో ఆ తేడా తెలియకుండా కవర్‌ చేయాలి. ‘ధమాకా’లో చూస్తే రవితేజ కుర్రాడిలా కనిపిస్తాడు, అలానే నటించాడు కూడా. దీంతో ఇప్పుడు ‘ఓజీ’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ను సుజీత్‌ ఎలా చూపిస్తాడు అనే ప్రశ్న మొదలైంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus