పవన్ కల్యాణ్ అభిమానులకు డబుల్ గుడ్ న్యూస్ ఇటీవల వచ్చింది. ఒకటి సుజీత్ సినిమా అనౌన్స్‌మెంట్ అయితే, రెండోది ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా ఇంకా లైవ్‌లోనే ఉంది అనే టాక్. అయితే ఇంకో రెండు విషయాల్లో క్లారిటీ రావాలి. అయితే ఈ రెండు సినిమాల గురించి అభిమానులు పెద్దగా ఆలోచించడం లేదు కానీ.. నిర్మాతలు, టాలీవుడ్ జనాలు మాత్రం ఆలోచిస్తున్నారు. అందుకే ఈ రెండు సంగతి ఓకే.. ఆ రెండింటి సంగతేంటి పవనూ అంటూ ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో సినిమాల్ని పక్కపెట్టి తన పార్టీ జనసేన కోసం పెద్ద ఎత్తున జనాల మధ్యలోకి వచ్చారు పవన్.
ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి.. వరుసగా చేస్తారేమో అనుకుంటే.. కరోనా పరిస్థితులు వచ్చాయి. ఇంకేముంది జీరో స్పీడ్‌తో ఆయన సినిమాలు ముందుకెళ్లాయి. ఈలోపు మళ్లీ ఆయన పొలిటికల్ పడవ ఎక్కేశారు. దీంతో వరుసగా సినిమాలు చేయాల్సిన పరిస్థితి నుండి.. ఎప్పుడెప్పుడు షూటింగ్ అనేలా మారిపోయింది. ఆ విషయం పక్కనపెడితే.. పవన్ సినిమాల లైనప్ ఈ మధ్య తరచుగా మారుతూ వస్తోంది. దీంతో ఆ సినిమా సంగతేమైంది, ఈ సినిమా సంగతేమైంది అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ రెండు సినిమాలు (గతంలో అనౌన్స్ చేసినవే) ఏమయ్యాయి అనేదే ప్రశ్న.
పవన్ సినిమాల లైనప్ చూస్తే.. చాలా రోజుల క్రితం నుండి రెండు సినిమాలు కనిపిస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారి ‘భవదీయుడు భగత్ సింగ్’, ఇంకొకటి రామ్ తాళ్లూరి – సురేందర్ రెడ్డి సినిమా. వీటి మధ్యలోకి పీపుల్స్ మీడియా వాళ్ల ‘వినోదాయ చిత్తాం’ రీమేక్ వచ్చింది. ఈ సినిమా రేపోమాపో స్టార్టింగ్ అంటూ వార్తలొచ్చినా.. ఇంకా మొదలుకాలేదు. దీంతో మొత్తంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ‘హరి హర వీరమల్లు’ సెట్స్ మీద ఉంది. సుజీత్ – డీవీవీ దానయ్య సినిమా ఇప్పుడే అనౌన్స్ అయ్యింది.
పవన్ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ‘హరి హర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’, సుజీత్ సినిమా మాత్రమే అవుతాయి అంటున్నారు. అయితే ఆ మూడు అవుతాయా అనేదే డౌట్ అట. అలాంటిది ‘వినోదాయ చిత్తాం’ రీమేక్, సురేందర్ రెడ్డి సినిమా చాలా కష్టం. అయితే ఈ సినిమాల అడ్వాన్స్‌లు పవన్ దగ్గర ఉన్నాయట. కాబట్టి ఎలాగోలా చేద్దాం అనుకుంటున్నాడట. కానీ ఎలా అనేది ఆయనే తెలియాలి.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!