Allu Sirish: సినిమానా.. వ్యాపారమా.. శిరీష్‌ ఆలోచనలు ఏంటో!

అల్లు శిరీష్‌… హీరో కాకముందు నుండే టాలీవుడ్‌తో పరిచయం ఉంది. అది తన తండ్రి తరఫు నుండి కాదు. హీరోగా వచ్చే ముందే సినిమా సంబంధిత మ్యాగజైన్స్ లాంటి వ్యాపారాలు కొన్ని చేశాడు. ఆ తర్వాత హీరో అయ్యాక వాటికి గ్యాప్‌ ఇచ్చాడు. అడపాదడపా అతని వ్యాపారాల గురించి వార్తలొచ్చినా ఎక్కడా ఫైనల్‌ కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి శిరీష్‌ బిజినెస్‌ గురించి సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వాటి ప్రకారం శిరీష్‌ ఇప్పుడు ముంబయిలో ఉన్నాడట.

కరోనా పరిస్థితుల తర్వాత టాలీవుడ్‌ పెద్ద హీరోలు, కుర్ర హీరోలు, కొత్త హీరోలు తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రతి ఒక్కరి చేతిలో కనీసం రెండు సినిమాలున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే శిరీష్‌ మాత్రం కొత్త సినిమా ముచ్చట్లేమీ చెప్పడం లేదు. అంతేకాదు గతంలో పూర్తి చేసేసిన ‘ప్రేమ కాదంట’ సినిమా విడుదల సంగతి కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో శిరీష్‌ ఎక్కడ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటికి సమాధానం ముంబాయ్‌ అని అంటున్నాయి అల్లు కాంపౌండ్‌.

గీతా ఆర్ట్స్‌ను బాలీవుడ్‌కి తీసుకెళ్లాలని గతంలో అల్లు అరవింద్‌ భారీ ప్రయత్నాలే చేశారు. కానీ సరైన రోడ్డు పడలేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా ముందుకెళ్లలేదు. ఇప్పుడు శిరీష్‌ అదే పనిలో ఉన్నాడని సమాచారం. బాలీవుడ్‌లో అల్లు అరవింద్‌ ఓ భారీ సినిమా స్టార్ట్‌ చేయనున్నారు. ఆ మధ్య ‘జెర్సీ’ ప్రెస్‌ మీట్‌లో ఆయనే ఈ విషయం చెప్పారు. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఈ సినిమా ఉంటుందని సమాచారం.

ఈ సినిమా పని మీద శిరీష్‌ ముంబయిలో ఉన్నాడని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. శిరీష్‌తోపాటు బన్ని వాస్‌ కూడా అక్కడే ఉన్నారట. అయితే ఓ ఐటీ కంపెనీతో డీల్ పెట్టుకొని షార్ట్ వీడియో యాప్‌ను డిజైన్‌ చేస్తున్నారనే పుకార్లూ వినిపిస్తున్నాయి. త్వరలోనే దాన్ని లాంచ్ చేస్తారట. ‘ఆహా’కు అనుబంధంగా ఈ యాప్‌ ఉండబోతోందనే ప్రచారమూ సాగుతుంది. దీనిని శిరీష్‌ హ్యాండిల్‌ చేస్తారట.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus