RRR Movie: జక్కన్న సినిమా ఆస్కార్‌ అవకాశంపై దర్శకుడి మాట ఇదీ!

‘ఆర్‌ఆర్ఆర్’ ఎలా ఉండొచ్చు.. అనే మాట నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఆస్కార్‌ వస్తుందా? అనేంతవరకు వచ్చాం. ఈ సినిమా సాధించిన విజయం, అందులోని అంశాలే దీనికి కారణం. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా, జాతీయ మీడియా.. ఇలా అందరూ ‘ఆర్‌ఆర్ఆర్‌కి ఆస్కార్‌ అవకాశం ఎంత?’ అనే మాట మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కూడా స్పందించారు. ఇదే విషయమైన కీలకమైన విశ్లేషణ చేశాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘RRR’.

ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని లెక్కలు చెబుతున్నాయి. త్వరలో ఈ లెక్కలు ఇంకా పైకి వెళ్తాయి కూడా. థియేటర్‌ల తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా మంచి విజయం అందుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్‌ను చూసి హాలీవుడ్‌ నటులు, నిపుణులు తెగ మెచ్చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు ఆస్కార్‌ వస్తుందా అంటూ లెక్కలేస్తున్నారు. వెరైటీ అనే ఇంటర్నేషనల్‌ మ్యాగజైన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్ కి ఆస్కార్‌’ అనే చర్చకు కారణమైంది.

ఈ సినిమా ‘ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యే అవకాశం ఉంది’ అంటూ తొలుత రాసుకొచ్చింది. తాజాగా అనురాగ్‌ కశ్యప్‌ ఈ విషయమై మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌కు 99 శాతం నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. ఇండియా నుండి అధికారిక ఎంట్రీ లభిస్తే, ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పోటీ పడే అవకాశం ఉందన్నారు.‘‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమాను సెలక్షన్‌ టీమ్‌ పరిగణనలోకి తీసుకుంటే.. ఆస్కార్‌ అవార్డ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో పోటీ పడే ఐదు చిత్రాల్లో ఒకటి కచ్చితంగా అవుతుంది అని అనురాగ్ కశ్యప్‌ కచ్చితంగా చెబుతున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో రాజమౌళి అనే కొత్త ఫిల్మ్‌ మేకర్‌ను వాళ్లు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఎంతో మందికి నచ్చింది. మార్వెల్‌ మూవీ కన్నా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎందులోనూ తీసిపోదు. అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు అక్కడి వారిని కట్టిపడేశాయి’’ అని అనురాగ్‌ వివరించారు. చూద్దాం ఏమవుతుందో మరి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus