మెగాస్టార్ – గురూజీ మధ్య ఏం జరిగింది…?

‘త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో నేను ఓ సినిమా చేయబోతున్నాను.. దానికి డి.వి.వి. దానయ్య నిర్మాత’ అంటూ ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకలో బహిరంగంగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అనౌన్మెంట్ ఇచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఇప్పుడు సీన్ చూస్తుంటే అది జరిగేలా లేదు. ‘సైరా నరసింహరెడ్డి’ పూర్తయిన తరువాత కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు మెగాస్టార్. దాని తరువాత సుజీత్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్ చేయబోతున్నాడు.

పోనీ దాని తరువాత అయినా త్రివిక్రమ్ తో సినిమా ఉండే ఛాన్స్ ఉందా అంటే.. అస్సలు లేదనే చెప్పాలి. ఎందుకంటే బాబీ డైరెక్షన్లో ఓ చిత్రం.. అలాగే మెహర్ రమేష్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేసేసాడు. ఇక అటు తరువాత కూడా హరీష్ శంకర్, పరశురామ్ వంటి క్రేజీ డైరెక్టర్ లతో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

అటు తరువాత పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబులతో సినిమా ఉంటుంది అని తెలుస్తుంది. ఇక వెంకటేష్ తో కూడా సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది కాబట్టి.. వాటి మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ‘చిరు- త్రివిక్రమ్ ల ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్టేనా.. లేక ఇద్దరూ మరిచిపోయారా?’ అనే విషయం పై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయం పై రాంచరణ్ అయినా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.ఎందుకంటే దానయ్యతో పాటు ఆ ప్రాజెక్ట్ కు ఈయన కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు..!

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus