విజయం ఎవరికైనా ఆనందం కలిగించే అంశం. ఆ విజయాన్ని దక్కించుకున్న వారి ప్రవర్తన, హుందాతనం వారికి గౌరవం తీసుకువస్తుంది. విజయం వచ్చింది కదా అని ఎగిరెగిరి పడితే ఎదుటివారి దృష్టిలో చులకనకాక తప్పదు. ఇప్పుడు బన్నీ, త్రివిక్రమ్ పరిస్థితి అలాగే ఉంది. వీరి సక్సెస్ సెలెబ్రేషన్స్ మరియు సభలలో చేస్తున్న వ్యాఖ్యలు కొంచెం హద్దుమీరుతున్నట్లు ఉంటున్నాయి. ప్రత్యక్షంగా ఎవరినీ పేరుపెట్టి విమర్శించకున్నా కొందరు హీరోలను టార్గెట్ చేస్తూ వారు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాశం అవుతున్నాయి. గత నెల 31న జరిగిన సక్సెస్ మీట్ వేదికగా వారు విడుదల చేసిన ఓ వీడియో సాంగ్ మరీ ఓవర్ గా ఉంది. బన్నీ అడుగుపెడితే రికార్డ్స్, బయటికి వస్తే మిగతా వాళ్లంతా ఇళ్లల్లో దాక్కోవాలి అనే అర్థం వచ్చేలా బన్నీని ఎలివేట్ చేస్తూ, మిగతా హీరోలు ఆయన ముందు నథింగ్ అన్నట్లుగా జానపద ధోరణిలో లిరిక్స్ కట్టి వదిలారు.
ఆ వీడియో చూస్తే ప్రత్యేకంగా కొందరిని టార్గెట్ చేస్తూ చిత్రం విడుదల తరువాత లిరిక్స్ కట్టించారని అర్థం అవుతుంది. దక్కిన విజయాన్ని ఇతరులను కించ పరిచే రేంజ్ లో జరుపుకోవడం ఏమిటనేది ఇక్కడి పాయింట్. నిజానికి బన్నీ కెరీర్ లో అల వైకుంఠపురంలో మినహా ఇస్తే ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ హిట్ లేదు. తనకంటే వెనుకొచ్చిన మెగా హీరో రామ్ చరణ్ మగధీర, రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకొని వున్నారు. ఇక మహేష్, ఎన్టీఆర్ ప్రభాస్ వంటి వారు ఇప్పటికే రెండు మూడు తమ ఖాతాలో వేసుకొని ఉన్నారు. అలాంటిది బన్నీ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కే ఇంతలా రెచ్చిపోవడం సరికాదు. మైక్ పట్టుకుంటే ఫిలాసఫీ మాట్లాడే త్రివిక్రమ్ సైతం ఇదే ధోరణిలో ఉండడటం గమనార్హం. ఇలాంటి ప్రవర్తన విజయం వలన వచ్చిన గౌరవాన్ని తగ్గిస్తుంది.