గత ఏడాది నాగబాబు ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అంతా నా ఇష్టం పేరుతో ఆయన మొదలుపెట్టిన ఆ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకొనేవాడు. అభిప్రాయాలు అనడం కంటే తనకు నచ్చని వారిపై, తన ఫ్యామిలీపై విమర్శలు చేసిన వారికి ఆ ఛానల్ ద్వారా కౌంటర్లు ఇవ్వడం, విమర్శించడం ఆయన అలవాటుగా పెట్టుకున్నారు. గత ఎన్నికల కు ముందు ఈయన ఆ ఛానెల్ ద్వారా బాలకృష్ణపై కొన్ని వరుస ఎపిసోడ్స్ చేశారు.
బాలయ్య గతంలో వారి కుటుంబాన్ని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వీడియోలు చేయడం జరిగింది. నాగబాబు బాలయ్య పై ఎన్ని ఆరోపణలు చేసినా బాలకృష్ణ స్పందించలేదు. ఇక జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసిన తరువాత మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి పై ఆయన కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఇక ఇటీవల బాలకృష్ణ టాలీవుడ్ ప్రముఖులను ఉద్దేశించి కొన్ని ఘాటు విమర్శలు చేయగా నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. బాలయ్య వ్యాఖ్యలు వెన్నక్కి తీసుకోవాలని..
తెలంగాణ ప్రభుత్వానికి, పరిశ్రమ పెద్దలకు క్షమాపణలు చెప్పాలి డిమాండ్ చేశారు. కాగా ఏమైందో ఏమో తెలియదు. ఒక్కసారిగా నాగబాబులో పెను మార్పు చోటు చేసుకుంది. ఆయన అంతా నా ఇష్టం ఛానెల్ పేరు, మన ఇష్టం అని మార్చారు. ఇక మాట తీరు, భాషా, పదాలు అంటూ కొత్త రాగం అందుకున్నారు. నాగబాబు లో ఈ ఆకస్మిక మార్పునకు కారణం ఏమిటో అర్థం కాలేదు.