‘ఖిలాడీ’ సినిమా ఈ రోజు విడుదలైంది. ఈ టైమ్‌కి మనం సినిమా గురించి, సినిమా కథ గురించి, సినిమా టాక్ గురించి మాట్లాడాలి. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ నాటి విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే… అది రవితేజ వల్లనే అని చెప్పాలి. సినిమా గురించి, సినిమా దర్శకుడు గురించి ఇటీవల రవితేజ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. ఆయన దర్శకుడిని నేరుగా ఏమీ అనలేదు కానీ, ఇన్‌డైరెక్ట్‌గా అన్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడేం జరిగింది, రవితేజ ఏమన్నారు అనేది కాసేపు పక్కన పెడదాం. కొన్ని రోజులు వెనక్కి వెళ్లి చూద్దాం. సినిమా షూటింగ్ చివరి దశకొచ్చిన రోజుల్లో సినిమా ఆగిపోయిందని వార్తలొచ్చాయి. సినిమా ఇక ఆగిపోయినట్లే అని వార్తలు కూడా వచ్చాయి. ఏమైంది, ఏం జరిగింది అంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ రోజుల్లో వాటిపై ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. కానీ తర్వాత షూటింగ్ మొదలయ్యేసరికి అంతా ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే… పరిస్థితి అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నట్లుగా ఉంంది. అంటే రవితేజ, రమేశ్ వర్మ ఏదో గ్యాప్ ఉన్నట్లుగానే ఉంది.
రవితేజ, రమేశ్ వర్మకి ‘ఖిలాడీ’ తొలి సినిమా కాదు. గతంలో ‘వీర’ అనే సినిమా చేశారు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఇక ఈ కాంబో కలవదు అని అనుకున్నారు. కానీ ‘ఖిలాడీ’తో మళ్లీ కలిశారు. ఈసారి హిట్ పక్కా అని అన్నారు. అనుకున్నట్లుగానే బజ్ బాగానే వచ్చింది. కానీ రవితేజ ఇటీవల మాట్లాడిన మాటలు చూస్తుంటే గ్యాప్ గట్టిగానే ఉంది అనిపిస్తోంది. ను జాతకాలు, అదృష్టం లాంటివి నమ్మను. కష్టాన్నే నమ్ముతా. కష్టపడి పని చేస్తాను. దానికి ఒక శాతం అదృష్టం తోడవుతుందేమో అని అన్నారు రవితేజ. కానీ డైరక్టర్ రమేష్ వర్మను చూస్తే జాతకం, అదృష్టం రెండూ కలసి వచ్చాయనిపిస్తుంది అని అన్నాడు రవితేజ.
సినిమా నిర్మాత కోనేరు సత్యనారాయణ… సినిమాకు అవసరమైనవన్నీ ఇవ్వడమే కాకుండా కారును కూడా బహూకరించారు. అందుకే రమేష్ వర్మను మహర్జాతకుడు అని అంటున్నాను అని అన్నారు రవితేజ.అయితే రవితేజ మాటలు రమేష్ వర్మ కష్టాన్ని కాకుండా లక్ ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడని అన్నట్లు ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. అయినా ఈ ఇద్దరి మధ్య ఇంతగా వారిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటో? అన్నట్లు రవితేజ మాటలపై రమేశ్ వర్మ భార్య ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసిన విషయమూ విదితమే.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!