చైసామ్ విడాకులు : అక్కినేని ఫ్యామిలీకి సమంతకి మధ్య అక్కడే చెడిందట..!

2020 కి ఏమాత్రం తీసి పోకుండా 2021 లో కూడా ఊహించని సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అందులో నాగ చైతన్య- సమంత విడాకుల మేటర్ ఒకటి. 2014 నుండీ ప్రేమించుకుంటున్న ఈ జంట 2017 లో పెద్దల్ని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లవ్లీ కపుల్, బెస్ట్ కపుల్ అనే విధంగా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే వీరి బంధం నాలుగేళ్ళకే ముగిసిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. అక్టోబర్ 2న చైతన్య.. సమంతతో విడిపోతున్నట్టు తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

నిజానికి ఈ విషయం పై ముందు నుండీ రకరకాల వార్తలు వచ్చాయి. కానీ సమంత… చైతన్య లు క్లారిటీ ఇవ్వలేదు. ‘లవ్ స్టోరీ’ సినిమా టైంలో చైసామ్ లు విడాకులు తీసుకుంటున్నారని దాదాపు ఖరారైపోయింది. ఎట్టకేలకు ఈ విషయాన్ని అక్టోబర్ 2న అధికారికంగా ప్రకటించాడు చైతన్య. అయితే వీరి విడాకుల మేటర్ ప్రకటించడానికి ముందే సమంతతో అక్కినేని ఫ్యామిలీ ప్రైవేట్ గా మీట్ అయ్యారట. ‘ఫ్యామిలీ మెన్2’ లో సమంత నటించిన బోల్డ్ సీన్ల గురించి డిస్కషన్ వచ్చిందట.

అక్కినేని ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్ ఉన్న ఫ్యామిలీ. ఇలాంటి ఫ్యామిలీకి చెందిన కోడలు అలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించడం సరికాదని.. భవిష్యత్తులో అలాంటి సన్నివేశాల్లో కానీ, ఐటెం సాంగ్స్ లో కానీ నటించకూడదని వారు కోరారట. ఇంకా చెప్పాలంటే ‘సూపర్ డీలక్స్’ సినిమా టైంలోనే సమంతకి నాగార్జున నచ్చచెప్పినట్టు ఇన్సైడ్ టాక్. అయితే వీటికి సమంత వ్యతిరేకించిందట. తనకి పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్టుల్లో నటించడం తప్పేంటి అంటూ సమంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు భోగట్టా.

ఈ ఇన్సిడెంట్ తో చైతన్య కి సమంతకి మధ్య గొడవలు పీక్స్ కు వెళ్ళాయాట. దీంతో ఇద్దరూ విడిపోవాలని డిసైడ్ అవ్వడంతో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగి ఇది సరైన పద్ధతి కాదు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారట. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తుంది. ‘ఫ్యామిలీ చెడ్డ పేరు తెచ్చే సినిమాల్లో నటించను’ అని చైతన్య ఇటీవల ఓ సందర్భంలో చెప్పడం కూడా ఈ విషయానికి చేసినట్టే అని తెలుస్తుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus