Tammareddy, Krishna: నాటి విషయాలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన తమ్మారెడ్డి!

ఇప్పటి సినిమా తరానికి ఈ విషయం గురించి పెద్దగా తెలియదు కానీ… 90వ దశకంలో ఈ విషయంలో చాలా పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగింది ఓ స్టార్ హీరో, ఓ పేరున్న దర్శకుడి మధ్య కాబట్టి. ఈ విషయంలో దాడులు, గొడవలు, కేసులు, జైళ్లు.. ఇలా చాలానే నడిచాయి. ఆ తర్వాత సద్దుమణిగింది అనుకోండి. కానీ అప్పుడేం జరిగింది అనేది చాలా తక్కువమందికే తెలుసు. ఆ రోజుల్లో కృష్ణ వర్సెస్‌ తమ్మారెడ్డిగా నడిచిన ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు ఆ దర్శకుడు.

1993 సమయంలో కృష్ణ – తమ్మారెడ్డి భరద్వాజ మధ్య పెద్ద గొడవే నడిచింది. ఒకానొక సమయంలో తమ్మారెడ్డి ఇంటిపై కృష్ణ ఫ్యాన్స్ దాడి చేయడం దాంతో ఆయన కేసులు పెట్టడం లాంటివి జరిగాయి. ఈ వ్యవహారంపై ఛాంబర్‌లో గొడవ కూడా జరిగింది. కేసులు కారణంగా కృష్ణ ఫ్యాన్స్ కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. ఇదంతా జరిగింది ‘రౌడీ అన్నయ్య’ సినిమా గురించే. ఆ సినిమాలో ఓ పాట గురించి ఇదంతా జరిగింది.

‘రౌడీ అన్నయ్య’లో సిల్క్ స్మితతో ఓ పాట పెట్టారట. సినిమాలో బాబు మోహన్ పాత్రకు సిల్క్ అంటే ఇష్టం. బాబు మోహన్ పాత్ర దగ్గర ఒక రహస్యం ఉంటుంది. సిల్క్ మోహంలో పడి ఆ రహస్యం చెప్పేయాలి అని మొదట స్క్రీన్ ప్లే రాసుకున్నారట. అయితే ఆ పాటలో కృష్ణ డ్యాన్స్ చేస్తా అన్నారు. కృష్ణ లాంటి హీరో అల్లరి చిల్లరిగా డ్యాన్స్ చేయడం ఏమిటని తమ్మారెడ్డి ఒప్పుకోలేదట. కానీ కృష్ణ మాత్రం చేస్తాననే పట్టుబట్టారట. దీంతో అ పాట చేయలేనని తమ్మారెడ్డి బయటికి వచ్చేశారట.

దీంతో నిర్మాతలు కృష్ణతో ఓ వెర్షన్‌, బాబు మోహన్‌తో మరో వెర్షన్‌ షూట్ చేశారట. ఆఖరికి సెన్సార్ బోర్డ్ ఆ పాటని కట్ చేయాలని పట్టుబట్టిందట. విషయం తెలిసి కృష్ణ షాక్ అయ్యారట. సెన్సార్‌ చేసేటప్పుడు బాబు మోహన్ వెర్షన్ పాట ఉంచారు. అయితే ఇది తమ్మారెడ్డి కావాలని చేశారట. విషయం తెలుసుకున్న కృష్ణ… చాలా హుందాగా తమ్మారెడ్డి దగ్గరికొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ‘ఈ రోజుతో మన ఫ్రెండ్‌షిప్‌ కట్’ అనేసి వెళ్లిపోయారట. ఆ తర్వాత పాట మరో వెర్షన్ షూట్ చూసి రిలీజ్ చేశారట.

ఈ విషయంలో కృష్ణ ఫ్యాన్స్ తమ్మారెడ్డి మీద ఆగ్రహించారు. ఆయనకు వ్యతిరేకంగా ఇంటి మీద దాడులు చేశారు. దీంతో ఆయన కేసులు పెట్టారు. దాడులు చేసిన వారు జైల్లో ఉంచారు. నాలుగేళ్లు తమ్మారెడ్డి – కృష్ణ మధ్య మాటల్లేవు. తర్వాత కేసులు విత్ డ్రా చేసుకోవచ్చు కదా అని కృష్ణ అడిగారట. దాంతో తమ్మారెడ్డి పంతం తగ్గించుకొని కేసులు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది అని చెప్పారు తమ్మారెడ్డి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus